4 year old dies of diamond rings chips చిన్నారి ప్రాణాలను బలిగొన్న చిప్స్ ఫ్యాకెట్

4 year old boy nireekshan dies of diamond rings chips

4 year old, meesala nireekshan, rings, chips, toy, throat, kummarirevu, eluru, west godavari, crime

4 year old boy nireekshan kumar dies after accidentally swallowing a toy given by diamond rings chips, in kummarirevu of eluru mandal west godavari.

చిన్నారి ప్రాణాలను బలిగొన్న చిప్స్ ఫ్యాకెట్

Posted: 11/01/2017 03:41 PM IST
4 year old boy nireekshan dies of diamond rings chips

పిల్లలు ఇష్టపడి తినే చిప్స్ ఓ పసివాడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దలు దుకాణాలకు వెళ్తున్నామంటే వెంటపడి మరీ వచ్చే పిల్లలు.. ఇలా వారికి రుచికరంగా అనిపించే వాటిని కొనుక్కుని తింటారు. ఇక పిల్లలను మరింత అకర్షించేందుకు చిన్న చిన్న బొమ్మలను కూడా కంపెనీలు అప్పడప్పుడూ కానుకగా ఇస్తాయి. అయితే ఇవి విడిగా ఇస్తే పర్వాలేదు కానీ.. చిప్స్ తోపాటు ప్యాకెట్లోనే వేసి ఇవ్వడంతో దానిని కూడా చిప్స్ అనుకుని మింగిన చిన్నారి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరిరేవులో నివసించే దంపతులకు మీసాల నిరీక్షణ్ కుమార్‌(4) అనే కుమారుడు ఉన్నాడు. ఇవాళ ఉదయం తల్లితో కలిసి పాల ప్యాకెట్ కొనడానికి దుకాణానికి వెళ్లాడు. పాలతో పాటు ‘డైమండ్ రింగ్స్’  చిప్స్ ప్యాకెట్ ను కొనుక్కున్నాడు. ఆ ప్యాకెట్ తో వచ్చే బొమ్మలంటే వాడికి చాలా ఇష్టం. ఇంటికి వచ్చి చిప్స్ తింటూ తింటూ పొరపాటున రబ్బను బొమ్మను కూడా మింగేశాడు. ఊపిరి ఆడని స్థితిలో కిందపడిపోయాడు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ కు గురయ్యారు.

వెంటనే బాలుణ్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు చెప్పారు. అప్పటిదాకా తమతో అడిపాడి, వచ్చి రానీ మాటలతో అలరించిన తమ చిన్నారి.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్చుకుంటూ నిరీక్షణ్ తల్లిదండ్రులు బోరున విలపించిన తీరు చుట్టుపక్కలవారిని కంటతడిపెట్టించింది. అక్కడి పిల్లలకు ‘డైమండ్ రింగ్స్‌’ కొనుక్కొని తినడం అలవాటేనని, ఇప్పుడు మాత్రం వాటిని దూరంగా ఉంచుతామని స్థానికులు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 4 year old  meesala nireekshan  rings  chips  toy  throat  kummarirevu  eluru  west godavari  crime  

Other Articles