viral video: dustbin offered prayings in bihar బిహార్ లో పూజలందుకుంటున్న కొత్తా దేవుడు..!!

Viral video women devotees perform pooja to dustbin in bihar temple

dustbin offered pooja, women offer pooja to dustbin, new god dustbin, bihar women innocense, bihar, jungle raj, nitish kumar, dusthin, pooja, women, innocense, social media, viral video, video viral

A bizzare incident shows the innocense of the rural women where they even perform pooja to dustbin in bihar temple. this videos posted on social media goes viral

ITEMVIDEOS: బిహార్ లో పూజలందుకుంటున్న కొత్తా దేవుడు..!!

Posted: 11/01/2017 12:34 PM IST
Viral video women devotees perform pooja to dustbin in bihar temple

బీహార్ లో కొత్తా దేవుడు పూజలందుకుంటున్నారు. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. అయితే ఈ దేవుడు మన దేశంలో మాత్రం ఎక్కడా కనిపించడు. అస్ట్రేలియాలో మాత్రం విపరీతంగా తిరుగుతూ అక్కడి వారికి నిత్యదర్శనం ఇస్తాడు. అయితే అక్కడి వారు మాత్రం ఈ దేవుడిని అసలు పట్టించుకోరు. మరోవిధంగా చెప్పాలంటే దేవుడిగానే పరిగణించరు. కాకపోతే ప్రేమగా చూస్తారు. మనుషులను చూస్తే చాలు ఈ దేవుడు గెంతులేస్తూ దూరంగా పారిపోతుంటాడు. అసలేంటి విచిత్రం.. ఎందుకీ ఉపోద్ఘాతం అంటారా..?

వివరాల్లోకి వెళ్తే.. మూఢభక్తిలో ప్రజలు ఎంతటి విపరీతాలకు తావిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శృతిమించనంతవరకు ఇదే సమంజసమే కానీ, మూర్ఖపు మూఢభక్తి అనర్థాలకు కూడా ధారి తీస్తుంది. అలాంటిదే ఓ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో జరిగింది. అయితే ఇక్కడ అనర్థమేమీ జరగలేదు కానీ.. దేశంలో ఇంతటి అమాయకులు కూడ వున్నారా..? అంటూ అనేక మంది నెట్ జనులు తమ కామెంట్లను పోస్టు చేస్తూన్నారు. అంతలా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అత్యంత భక్తి భావాలున్న దేశంగా ఖ్యాతికెక్కిన భారత్ దేశంలో చెట్లు, పుట్టలు, పశు పక్ష్యాదులు కూడా పూజలందుకుంటాయి. తాజాగా ఓ డస్ట్ బిన్ కూడా పూజలు అందుకుంటోంది. బీహార్ లోని ఓ గుడిలో కంగారు బొమ్మ ఆకారంలోని చెత్త కుండీని ఉంచగా, అక్కడికి వచ్చిన మహిళలు దానికి పూజలు చేస్తుండగా, వీడియో తీసిన ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదింక వైరల్ అయింది. డస్ట్ బిన్ కు పసుపు, కుంకాలు అద్ది, ఆపై చెత్త వేయాల్సిన చోట పూలు సమర్పిస్తూ, జలాభిషేకం చేసేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  jungle raj  nitish kumar  dusthin  pooja  women  innocense  social media  viral video  video viral  

Other Articles