EC has authorised PM to announce date of Gujarat polls గుజరాత్ ఎన్నికల షెడ్యూల్డుపై చిదంబరం చిర్రుబుర్రు..

Chidambaram slams eci for not announcing gujarat poll schedule

Vijay Rupani, Gujarat, Gujarat assembly poll, Chidambaram, farmers interest free loans, gujarat gourav yatra, farmers loans at zero interest, Vijay Rupani announces farmers loans, Vijay Rupani, Gujarat, gujarat farm loans, gandhinagar, BJP, Amit Shah, PM Modi, Technical error, CEC, central election commission, politics, congress

Former Union Minister P Chidambaram has accused the Election Commission of going on an "extended holiday" for the delay in announcing dates for Gujarat Assembly elections.

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ పై చిదంబరం చిర్రుబుర్రు..

Posted: 10/20/2017 05:50 PM IST
Chidambaram slams eci for not announcing gujarat poll schedule

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి రమారమి పది రోజులు కావస్తున్నా.. కేంద్ర ఎన్నికల కమీషన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంతో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై మాజీ కేంద్ర అర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం ఏకంగా సీఈసీని టార్గెట్ చేస్తూ చిర్రబుర్రులాడారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 18 లోపుగానే నిర్వహిస్తామని చెప్పిన ఈసీ.. షెడ్యూలును ప్రకటించికపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని సహా ఎన్నికల సంఘంపై కూడా ఆయన వ్యంగంగా ట్విట్లు చేశారు.

గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించక పోవడం వెనుక కారణమేంటంటూ నిలదీశారు. ‘‘ఈసీ తన సెలవులను పొడిగించుకుంది. గుజరాత్ ప్రభుత్వం అన్ని రకాల తాయిలాలు, రాయితీలు ప్రకటించిన తర్వాతే.. ఈసీకి మళ్లీ గుజరాత్ ఎన్నికలు గుర్తొస్తాయి..’’ అని చిదంబరం తన ట్విట్ల ద్వారా వ్యంగోక్తులు వేశారు. అంతేకాదు గుజరాత్ ఎన్నికల తేదీ ప్రకటించే అధికారాన్ని ఈసీ ప్రధాని మోదీకి అప్పగించిందంటూ ఆరోపించారు. ‘‘గుజరాత్ లో తన చివరి ర్యాలీ సందర్భంగా మోదీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఈసీకి కూడా చెబుతారులే..’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16న గుజరాత పర్యటనకు వెళ్లాల్సి వుంది. కానీ అనివార్యకారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆయన ఎప్పుడు గుజరాత్ పర్యటన చేపట్టితే.. ఆ తరువాతే.. ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల తేదీలను ప్రకటిస్థారని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ఇప్పటికే సీఈసీ గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించకుండా వాయిదా వేయడంపై సీపీఎం తీవ్ర విమర్శలు గుప్పించింది. వాస్తవానికి ఈ నెల 12న ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈసీ కేవలం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ప్రకటించి.. గుజరాత్‌పై ఎన్నికల తేదీలపై మౌనం వహించడంతో విపక్షాలు భగ్గుమన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles