THIS CM rode a scooter without wearing a helmet. హెల్మెట్ అవసరం లేదని ముఖ్యమంత్రి సంకేతాలు..

This cm rode a scooter without wearing a helmet

Chief Minister Raghubar Das, two-wheeler, helmet, CM breaks the law, Jamshedpur, Kishore Sahdeo, jharkhand Congress General Secretary, jharkhand, Congress, BJP

Jharkhand Chief Minister Raghubar Das was spotted riding a scooter without wearing a helmet in Ranchi, he who ignored the law, as well as the basics of riding a two-wheeler.

ITEMVIDEOS: హెల్మెట్ అవసరం లేదని ముఖ్యమంత్రి సంకేతాలు..

Posted: 10/21/2017 08:45 AM IST
This cm rode a scooter without wearing a helmet

యధా రాజా తథా ప్రజా అన్న నానుడి కూడా ఒకటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ మర్చిపోయినట్లు వున్నారు. లేదా.. ఏళ్ల తరువాత రోడ్డుపై వాహనాన్ని నడుపుతున్నానన్న అనందంలో మర్చిపోయారో ఏమో కానీ.. అదే తాజాగా చర్చనీయాంశంగా మారిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తే తప్పుకానప్పుడు.. తాము చేస్తే తప్పేలా అవుతుందని సామాన్య ప్రజలు నిలదీసేందుకు కూడా అస్కారాలు అనేకం వున్నాయి. మొత్తంగా చేయక చేయక చేసిన ప‌ని రఘుబర్ దాస్ ను విమ‌ర్శ‌ల‌ పాలు చేస్తుంది.

అందుకు కారణమమేంటె మీకు అర్థమయ్యే వుంటుంది, సరదాగా ఆయన చేసిన పని.. తనతో పాటు రాష్ట్ర పరువును కూడా వీధిపాలు చేస్తుందని విమర్శలు వినబడుతున్నాయి. రాంచీలో రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర వాహ‌నాన్ని న‌డిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ పెట్టుకునే ద్విచ‌క్ర వాహ‌నాల్ని న‌డ‌పాల‌ని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సూచిస్తోంటే,

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తే ఇలా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా, ద్విచక్ర వాహనంపై ఆయ‌న ప్ర‌యాణించిన స‌మ‌యంలో ముఖ్యమంత్రి స్థాయి పాలకుడికి వుండాల్సిన భద్రతా కూడా లేకపోవడంపై విమర్శలు వినబడుతున్నాయి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని భద్రతా సిబ్బంది మర్చిపోయారా..? లేక కావాలనే ఆయనను తన మానన తనను వదిలేశారా..? అని విపక్షాలు నిలదీస్తున్నాయి.  

జంషెడ్ పూర్‌లోని త‌న నివాసంలో దీపావ‌ళి జ‌రుపుకున్న అనంత‌రం ర‌ఘుబ‌ర్ దాస్ ఇలా ద్విచ‌క్ర‌వాహ‌నంపై చ‌క్క‌ర్లు కొట్టడాన్ని పలువురు నెట్ జనులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్వయంగా ముఖ్య‌మంత్రి ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ అవసరం లేదన్న సంకేతాలను ఇచ్చారని ఒకరు పోస్ట్ చేయగా, ఇక హెల్మట్ నిబంధన త్వరలో వీడిపోనుందన్న సీఎం తన చర్యలతో సిగ్నల్స్ అందించారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సీఎం తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles