అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా సేవలు అందించినా.. తన బిడ్డలకు మరీ ముఖ్యంగా కూతుళ్లకు తండ్రి అన్న విషయానికి వస్తే మాత్రం.. అకాశమంతా సినిమాలో తండ్రిపాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కనబర్చిన ప్రేమకన్నా అధికంగానే వుంటుంది. తండ్రి, తనయల మధ్య వున్న ప్రేమను ఎంత బలంగా పెనువేసుకుంటుందో ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే.. ఈ ప్రేమను విషయాన్ని సందర్భోచితంగా చెప్పారు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.
గత ఎనమిదేళ్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన తన అధికార నివాసంగా వున్న శ్వేతభవనం నుంచి తన కూతుళ్లను పాఠశాలకు పంపారు. అయితే రెండు పర్యాయాలు అధ్యక్షునిగా సేవలందించిన తన పదవీ కాలం ముగియడంతో.. తన సొంతనివాసానికి మారిపోయిన ఒబామా.. తన కుమార్తె మలియాను కళాశాలలో చేర్పించినప్పుడు తాను కూడా భావొవ్వేగానికి గురయ్యాని, అయితే తన కనురెప్పాలు దాటి వస్తున్న కన్నీరును మాత్రం మాలియా కంటపడకుండా దాచేసుకున్నానని అన్నారు.
మాజీ ఉపాధ్యక్షుడు జోయీ బిడెన్ స్థాపించిన ‘బో బిడెన్ ఫౌండేషన్’ కోసం విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని విల్మింగ్టన్ లో నిర్వహించాగా.. ముఖ్య అతిథిగా హాజరైన ఒబామా మాట్లాడుతూ.. ‘మనకు ఆడపిల్లలు ఉంటే జీవితంలో అన్నీ వేగంగా జరిగిపోతుంటాయి. ఇటీవల నేను మలియాను కళాశాలలో చేర్పించాను. ఆ క్షణం నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్లే అనిపించింది. అప్పుడు ఏడ్చేశాను కూడా. కానీ మలియా ముందు కన్నీరుపెట్టుకోలేదు. అది నేను గర్వంగా చెప్పుకోగలను. అది చాలా కఠినమైన క్షణం. జీవితం మొత్తంలో గుర్తుపెట్టుకునేది మన పిల్లల విశేషాలే.’ అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more