minimum-charge for hyderabad metro ticket మెట్రోరైలులో కనీస టిక్కెట్ ధర ఎంతో తెలుసా.?

Telangana government planning for minimum charge for metro ticket

mmts metro rtc common ticket, common ticket, minimum price, maximum price, metro, mmts rates, rtc bus tickets rates, telangana government, mmts metro common ticket, mmts rtc buses common ticket, metro rtc busses common ticket, common ticket, mmts, metro rail, rtc buses, hyderabadis, good news, telangana government

telangana government planning for minimum ticket for travelling in hyderabad Metro as Rs 10 and maximum charge varies depending on the distance but at large it might be Rs 30

హైదరాబాద్ మెట్రోరైలులో కనిష్ట టిక్కెట్ ధర ఎంత.?

Posted: 09/21/2017 05:07 PM IST
Telangana government planning for minimum charge for metro ticket

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు ఈ నవంబర్ తో బ్రేకులు పడునున్న నేపథ్యంలో మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇప్పటికే అటు ఎంఎంటీఎస్ రైలుతో పాటు ఇటు అర్టీసీ బస్సులను అనుసంధానం చేస్తూ కామన్ టికెట్ లను తీసుకురావాలని ఓ శుభవార్తను ఇప్పటికే హైదరాబాదీలకు చేరవేసి సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక మరో విషయంలో కూడా హైదరాబాదీ ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకూడదని చర్యలు ముమ్మరం చేసింది.

అదే మెట్రో రైలులో ప్రయాణించాలంటే కనీస టిక్కెట్ దర ఎంత వుంచాలన్నది ఇప్పడు చర్చిస్తుంది. దేశరాజధాని ఢిల్లీలో వున్నట్లుగా రూ. 10నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక మరోవైపు ఎంఎంటీఎస్ దరలను పరిశీలిస్తే గరిష్టంగా వున్న రేటు రూ.10. ఇక అర్టీసీ బస్సుల్లో మినిమమ్ టిక్కెట్ ధర పరిశీలిస్తే అది రూ.7గా వుంది., దీంతో రూ. 10నే కనిష్ట ధరగా ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

మెట్రో ముఖ్యఉద్దేశ్యం ట్రాఫిక్ నియంత్రణ. కాలుష్య నియంత్రణ.. దీంతో అత్యధికులు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటే కనీస దరను రూ. 10గానే నిర్థారించాలని పలువురు అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే గరిష్ట ధర మాత్రం వారి దూరం నిడివిని బట్టి మారుతుందని మెట్రో రైలు అధికారులు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిరు. అయితే గరిష్టంగా వుండే ధర మాత్రం రూ. 30 మించి వుండరాదన్న వాదనలు వినిపిస్తున్నా.. నలబై రూపాయాలుగా కూడా నిర్ధారించవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. నవంబర్‌లో మెట్రో రైలు ప్రారంభం నాటికి మెట్రో చార్జీలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles