Five killed, six injured in road accident near tirunelveli రక్తమోడిన తిరునెల్వేలి.. ఐదుగురు గుంటూరువాసుల మృతి

Five killed six injured in road accident near palayamkottai

Palayamkottai accident, tirunelveli accident, tamil nadu accident, cement lorry hits road crossing people, cement lorry hits tourist bus, road accident, guntur, ponnur mandal, kollur, tirunelveli, cement lorry, travels bus, tamil nadu, crime

Five persons including three men and two women from Andhra Pradesh were killed and six others were injured in a road accident on Palayamkottai outskirts in the early hours of Saturday.

రక్తమోడిన తిరునెల్వేలి.. ఐదుగురు గుంటూరువాసుల మృతి

Posted: 09/16/2017 11:59 AM IST
Five killed six injured in road accident near palayamkottai

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కకు నిలిపి వున్న టూరిస్టు బస్సును లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులందరూ గుంటూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను స్తానిక అస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పోన్నూరు మండలం కొల్లూరుకు చెందిన పలువురు కన్యాకుమారి సహా తమిళనాడు రాష్ట్ర పర్యటనకు టూరిస్టు బస్సును అద్దెకు తీసుకుని వెళ్లారు. సరిగ్గా తిరునెల్వేలి-కన్యాకుమారి నాలుగు లేన్ల రోడ్డు రహదారిలో ఐఆర్టీ కళాశాల వద్ద మలుపు తీసుకునేందుకు ముందు బస్సులోని యాత్రికుల వినతి మేరకు కాలకృత్యాలను తీర్చుకునేందుకు రోడ్డు పక్కన బస్సును నిలిపారు. అదే సమయంలో వెనక నుంచి కన్యాకుమారి వైవే వెళ్తున్న సిమెంటు లోడ్డు లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొనింది. అదే సమయంలో రోడ్డు దాటి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తున్న యాత్రికులను కూడా ఢీకొనింది.

ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా కలెక్టర్ తిరనెల్వెలి కలెక్టర్ తో మాట్లాడి క్షతగాత్రులకు అత్యవసర సూపర్ స్పెషాలిటీ చికిత్నను అందించాల్సిందిగా కోరారు. దీంతో పాటు కొల్లూరు ఎమ్మారో, సహా ఎస్ హెఛ్ ఓ ను కూడా ఘటనాస్థలానికి వెళ్లి బాదితులు అదుకోవాల్సిందిగా అదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : road accident  guntur  ponnur mandal  kollur  tirunelveli  cement lorry  travels bus  tamil nadu  crime  

Other Articles