nitish kumar says sorry to tejashwi, says vacate please తేజస్వీ.. వెళ్లక తప్పదు.. మరో మార్గం లేదు..

Nitish kumar says sorry to tejashwi says vacate please

nitish kumar, tejaswi yadav, sushil modi, government building, lalu prasad yadav, deputy cm, politics

bihar chief minister nitish kumar yadav says sorry to tejashwi yadav former deputy cm, says to vaccate government building

తేజస్వీ.. వెళ్లక తప్పదు.. మరో మార్గం లేదు..

Posted: 09/16/2017 09:36 AM IST
Nitish kumar says sorry to tejashwi says vacate please

బిహార్ రాష్ట్రంలో జేడియు పార్టీ అధికారంలో వచ్చేందుకు దోహదం చేసిన మహాగట్ బంధన్ తన సొంత బిడ్డలాంటిదని, తన బిడ్డను తానే ఎందుకు చంపుతానని ప్రశ్నించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బిడ్డను చంపడమే కాకుండా.. 24 గంటల వ్యవధిలో మరో బంధానికి తోడుచేసుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ డిఫ్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తానెంతో ఇష్టపడి మార్పు చేర్పులు చేయించుకున్న పాట్నా, సర్క్యులర్ రోడ్ లోని 5వ నంబర్ బంగళా, 'పలాటియల్'ను తనకే కేటాయించాలని కోరుతూ సీఎం నితీశ్ కుమార్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే,

గతంలో ఈ భవనాన్ని అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఖాళీ చేయకపోవడంతో.. దానిని అతనికే కేటాయించిన విషయాన్ని కూడా తేజస్వీ యాదవ్ ప్రస్తావించారు. అయితే తేజస్వీ యాదవ్ వినతిని మాత్రం నితిష్ కుమార్ నిద్వందంగా తోసిపుచ్చారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తేజస్వి ఈ బంగళాను ఎంచుకుని, దానికి ప్రజాధనంతో మరమ్మతులు, అదనపు హంగులు కల్పించుకున్నారు. కాగా శరవేగంగా మారిన బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యం ఉపముఖ్యమంత్రి పదవికి దూరమైన తేజస్వీ.. భవనాన్ని కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే తానెంతో శ్రమించిన సాధించుకున్న పదవి పోయినా కనీసం ఇష్టపడిన మరమ్మతులు చేయించుకున్న భవనానైనా తనకే కేటాయించాలని విన్నవించినా అ కోరిక మాత్రం తీరని కోరికగానే మిగులుతుంది. తేజస్వీ వినతిపై స్పందించిన నితీశ్, ఈ పని చేసి పెట్టడం తన వల్ల కాదని, అందుకు తనను క్షమించాలని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులపై ఎవరూ వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోరాదు. నేనీవేళ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. కానీ నా పదవి కూడా శాశ్వతం కాదని నితీశ్ ఉచిత సలహాలు కూడా ఇచ్చాడట. దీంతో మరి తేజస్వి ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఖాళీ చేస్తోరో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitish kumar  tejaswi yadav  sushil modi  government building  deputy cm  politics  

Other Articles