Irma tears through Caribbean en route to Florida కాకవికళమైన కరేబియన్ దీవులు.. 14 మంది మృతి..

Hurricane irma causes at least 14 deaths in caribbean islands

Hurricane Irma, US news, Bahamas, Florida, Miami, Hurricanes, Natural disasters and extreme weather, Americas, caribbean, florida, miami, key west, barbuda, weather forecast, natural disaster, us news, world news

Hurricane Irma lashed the Caribbean islands, causing at least 14 deaths, while in the U.S., Florida, Georgia and South Carolina are facing states of emergency as residents brace for the monster storm.

కాకవికళమైన కరేబియన్ దీవులు.. 14 మందికి పైగా మృతి..

Posted: 09/08/2017 10:21 AM IST
Hurricane irma causes at least 14 deaths in caribbean islands

అగ్రరాజ్యం అమెరికావాసులను భారీ హారికేన్ ఇర్మా వణికిస్తోంది. మరి ముఖ్యంగా కరేబియన్ దీవుల్లో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా.. పద్నాలుగు మందికిపైగా ప్రాణాలను కబళించివేసింది. కరేబియన్ దీవుల్లో బీభత్సం అనంతరం తాజాగా ఫ్లొరిడా వైపుకు మరీ ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొల్ప్ కొర్సుల వైపు పయనిస్తుంది. అదివారం దక్షిణ ఫ్లోరిడాను ప్రాంత తీరాన్ని ఇర్మా తాకే అవకాశం వుంది. దీంతో అమెరికా వాతావరణ శాఖ అధికారులు ఫ్లోరిడా ప్రాంతంతో పాటు చుట్టుపక్కనున్న ప్రాంతాల ప్రజలను కూడా హెచ్చరిస్తున్నారు.

దీంతో తీరప్రాంత ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు శరవేగంగా చేపడుతున్నారు. ఫ్లోరిడాతో పాటు ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్‌ మార్టిన్‌, ప్యూర్టోరికా దీవుల్లో ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు అక్కడి ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంటకు 285 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తుండటంతో విద్యుత్‌, సమాచార, రవాణా వ్యవస్థలు కుప్పకూలాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని అలలు 25 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి.

ఇప్పటివరకు అమెరికావై ప్రభావం చూపిన హరికేన్లలో ఇర్మా అతిపెద్దదని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. 12 లక్షల మందిపై ప్రభావం చూపుతుందని భావించగా, అది ఏకంగా 2.6 కోట్ల మంది ప్రజలపై ప్రభావాన్ని చూపుతుంది. సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంలో ఇర్మా ధాటికి 95 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక ఇర్మా హరికేన్ చురుగ్గా కదులుతున్న నేపత్యంలో దాని ప్రభావం ఫ్లొరిడాపై కూడా తీవ్రంగా పడనుందని భావిస్తున్న అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఫ్లొరిడాలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hurricane irma  caribbean  florida  miami  key west  barbuda  weather forecast  natural disaster  us news  world news  

Other Articles