TDP bramhananda reddy wins Nandyal By-election నంద్యాలలో టీడీపీ జయకేతనం.. అభివృద్దికే ఓటరు పట్టం

Tdp bramhananda reddy wins nandyal by election

Nandyal Assembly bypoll, Andhra Pradesh, Chandrababu Naidu, YS Jagan, bramhananda reddy, bhuma nagireddy, shipa mohan reddy, Politics

Ruling TDP party gets landslide victory in nandyal by-elections, as its candidate bhuma bramhananda reddy wins with 27, 456 votes over shilpa mohan reddy

నంద్యాలలో టీడీపీ జయకేతనం.. అభివృద్దికే ఓటరు పట్టం

Posted: 08/28/2017 01:04 PM IST
Tdp bramhananda reddy wins nandyal by election

నంద్యాల ఉప ఎన్నకలో అధికార టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 27,456 ఓట్ల మెజారిటీతో ఘనవిజయాన్ని అందుకున్నారు. భూమా నాగిరెడ్డి అకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలలో అధికారపక్షం.. ప్రతిపక్షం మధ్య హోరాహోరిగీ సాగిన ఎన్నికలలో అధికార పక్షానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి.. విజయాన్ని అందుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

అది నుంచి అధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన టీడీపీ.. తొలి రౌండ్ నుంచే ప్రతీ రౌండ్ లోనూ అధిక్యాన్ని కనబర్చింది. రౌండ్ రౌండ్ కు తన అధిక్యతను పెంచుకుంటూ ఏకంగా 27 వేల 456 ఓట్ల మెజారీటీతో తన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన శిల్పా మోహన్ రెడ్డిని ఓడించారు. నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ ను మొత్తం 19 రౌండ్లులో పూర్తి చేయగా, ఒక్క 16వ రౌండ్ మినహా అన్ని రౌండ్లలో టీడీపీ అధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఉప ఎన్నిలలతో రాష్ట్రంలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదన్న సంకేతాలను టీడీపీ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందించింది. 

కాగా, అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నంద్యాలలో టీడీపీ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారని.. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నంద్యాల ఉపఎన్నికలలో ప్రతిపక్ష నేత జగన్‌ పక్షం రోజుల పాటు అక్కడే మకాం వేసినా.. ప్రజలు ఆయనను తిరస్కరించి.. అభివృద్దిని కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చేయాలి, ఉరితీయాలి అని జగన్‌ చేసి వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చంద్రబాబు అన్నారు.

నంద్యాల ఓటరు తీర్పును గౌరవిస్తామని వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి అన్నారు.  నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి వల్లే టీడీపీకి ఓట్లు పడ్డాయన్న వాదనను తాను విశ్వసించడం లేదని చెప్పారు. అనారోగ్యం, మలేరియా ఫీవర్ వల్ల 28 రోజులు తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అయితే, ఆ ప్రభావం పడలేదని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇక తాను రాజకీయ సన్యానం చేస్తానన్న వ్యాఖ్యలపై తాను మళ్లి స్పందిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal Assembly bypoll  Andhra Pradesh  Chandrababu Naidu  YS Jagan  Politics  

Other Articles