Call drops could cost telecos more dearly కాల్ డ్రాప్ అయ్యిందా..? మీ టెల్కోలకు భారీ జరిమానా..!

Trai planning to get strict with telcos on call drop issue

Call drops, Telecom regulator, Mobile phones, Telecom companies, TRAI, Telco, Telecom, Tower, Penalty

The regulator is set to estimate number of call drops by collecting data on telecom towers' performance and accessing back-end database of telecommunication companies,

కాల్ డ్రాప్ అయ్యిందా..? మీ టెల్కోలకు భారీ జరిమానా..!

Posted: 08/19/2017 11:18 AM IST
Trai planning to get strict with telcos on call drop issue

మాట్లాడుతుండగానే అనుకోని సాంకేతిక లోపంతో మీ కాల్‌ డ్రాప్ అయ్యిందా..? ఇలా కాల్ డ్రాప్ అయితే ఆయా వినియోగదారులకు డ్రాప్ అయిన కాస్టును కట్టించాలని కస్టమర్లకు మేలు చేసేలా.. ముందుగా నిర్ణయం తీసుకున్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా అ నిర్ణయానికి బదులుగా టెలికాం కంపెనీలకు భారీగా జరిమానాలు విధించే పనిలో పడింది. దీంతో డబ్బులను సంపాదించే మార్గాన్ని వెతుకుంది. అయితే కాల్ డ్రాప్ అయిన కస్టమర్లకు మాత్రం ఏం లాభం చేకూరుతుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

కాగా ఈ జరిమానాల నేపథ్యంలో త్వరలో ఇక అన్ని ప్రాంతాల్లో నాణ్యతాయుతమైన సిగ్నలింగ్ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తుంది.  ట్రాయ్ విధించే జరిమానాలు లక్ష్ రూపాయల నుంచి ఏకంగా పది లక్షల వరకు వుండనున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల పాటు ట్రాయ్‌ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇవి అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ‘

అయితే ఇక కాల్ డ్రాప్ ను ఇన్నాళ్లు సర్కిళ్ల వారిగీ లెక్కించిన ట్రాప్ ఇకపై టవర్ల వారీగా లెక్కించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంది. దీంతో ఇకపై సర్కిల్‌ పరిధిలోని టవర్ల వారీగా లెక్కించనుంది. కాల్‌ అంతరాయాల లెక్కింపును సగటును పరిగణనలోకి తీసుకుంటే, అనేక అంశాలు మరుగున పడుతున్నాయపి భావించిన ట్రాయ్.. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు పనిచేయకపోవడం, అరకొరగా సేవల నాణ్యత వంటివి లెక్కలోకి వచ్చేవి కాదు. కొత్త మార్గదర్శకాల్లో, నెట్‌వర్క్‌ పరిధిలో ఇలాంటి తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందులనూ గుర్తించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Call drop  TRAI  Telco  Telecom  Tower  Penalty  

Other Articles