Birthplace of Saint Peter found in Israel: Archaeologist యేసుక్రీస్తు ప్రథమ శిష్యుడి స్వగ్రామం గుర్తింపు..!

Birthplace of saint peter two other apostles found in israel archaeologist

Jesus, Saint Peter, apostles, Israel, Sea of Galilee, Lake Tiberias, Birth place, Israeli archaeologists, American archaeologists

Israeli and American archaeologists have likely uncovered the lost Roman city of Julias near the banks of the lake, also known as Lake Tiberias, said Mordechai Aviam of Kinneret Institute for Galilean Archeaology.

యేసుక్రీస్తు ప్రథమ శిష్యుడి స్వగ్రామం గుర్తింపు..!

Posted: 08/08/2017 08:41 PM IST
Birthplace of saint peter two other apostles found in israel archaeologist

క్రైస్తవుల ధైవం యేసుక్రీస్తు మళ్లీ వస్తారని అచెంచలమైన భక్తి విశ్వాసాలతో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుంటారు. ఆయన రాక దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణగా మారుతుందని కూడా ప్రచారం చేస్తారు. అయితే ఇదే విషయాన్ని అన్ని మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణణుడు కూడా యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్!! పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అర్జునుడికి ఉపదేశించాడు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఇప్పటికీ శ్రీకృష్ణుడి, శ్రీరాముడు భూమిపై నడయాడిన ప్రాంతాల విషయంలో అనేక అధారాలు ఇప్పటికీ సాక్షాలుగా కనబడుతున్నాయి.

కాగా దేవుళ్ల ఉనికిని ప్రశ్నిస్తూ ఇప్పటికీ నాస్తిక సమాజం నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ క్రమంలో జీసస్ శిష్యుల్లో ప్రధముడిగా గుర్తింపు పొందిన సెయింట్ పీటర్ స్వగ్రామాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర ఇజ్రాయిల్ లోని గెలిలీ నది ఒడ్డున సెయింట్ పీటర్ జన్మించిన బెత్సయిదా గ్రామాన్ని అమెరికా, ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఫ్లావియస్‌ జోసెఫస్‌ చెప్పిన ప్రకారం జులియస్‌ అనే నగరాన్ని క్రీస్తు శకం 30వ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరాన్ని సెయింట్ పీటర్ జన్మించిన బెత్సయిదా గ్రామంపై నిర్మించారని వారు తెలిపారు.

సెయింట్ పీటర్ తో పాటు సెయింట్ ఫిలిప్, పీటర్ సోదరుడైన సెయింట్ ఆండ్రూ కూడా ఇదే గ్రామంలో జన్మించారు. మత్స్యకారులైన ఈ ముగ్గురూ క్రీస్తు పిలుపుతో ఆయనను అనుసరించారని బైబిల్ చెబుతుంది. జూలియస్ నగరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జరుపుతున్న పరిశోధనల్లో ఊహించని విధంగా దానికంటే ముందే నిర్మితమైన బెత్సయిదా గ్రామం వెలుగులోకి వచ్చిందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ తవ్వకాల్లో మట్టిపాత్రలు, నాణేలు, స్నానపు గదులు వంటి వాటిని వెలుగులోకి తెచ్చామని వారు తెలిపారు. అవన్నీ బెత్సయిదా గ్రామం చిన్నదేనని తెలిపేలా ఉన్నాయని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Israeli archaeologists  American archaeologists  Saint Peter  Birth place  Jesus  

Other Articles