Haryana BJP Vice-President's On Chandigarh Stalking Case బీజేపి నోటి దురుసు.. బాధితురాలి ఘాటు సమాధానం..

Not your business if i stay out late says woman who was stalked

haryana, bjpvicepresident, ramveerbhatti, stalking, 29-year-old woman, bjp leader son stalk woman, Varnika Kundu, Subhash Barala, Vikas Barala, ramveer bhatti, BJP, haryana

BJP state vice president Ramveer Bhatti has made some shocking remark on the woman who filed an FIR against BJP leader's son for stalking her.

బీజేపి నేత నోటి దురుసు.. బాధితురాలి ఘాటు సమాధానం..

Posted: 08/07/2017 06:21 PM IST
Not your business if i stay out late says woman who was stalked

హర్యానాలో అధికార బీజేపి నేతల హద్గుమీరి చేస్తున్న వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం అవుతున్నాయి.రెండు రోజుల క్రితం పార్టీ పీకల వరకు మద్యం సేవించి.. మహిళలను వెంబడించి నానా హంగామా చేసిన కేసులో అధికార బీజేపి అధ్యక్షుడు సుబాస్ బరాలా కొడుకుపై విమర్శలు రేగిన విషయం తెలిసిందే. అయనకు ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రే బాసటగా నిలిచారు. కొడుకు చేసిన పనులు తండ్రికి శిక్ష ఎలా విధిస్తామని మద్దుతు పలుకగా, హర్యానాకు చెందిన బీజేపి ఉపాధ్యక్షుడు రఘువీర్ మరో అడుగు ముందుకేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

రాత్రి వేళల్లో మహిళలకు బయట ఏం పని అని..? అమెను ఎందుకు బయటకు పంపించారంటూ ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సుద్దులు చెప్పారు. వారిని రాత్రి వేళలో బయట తిరిగేందుకు అనుమతించకూడదని ఆయన సలహా ఇచ్చారు. చీకటి పడకముందే పిల్లలు ఇంటికి చేరుకోవాలని ఆయన హితవు పలికారు. రాత్రి బయట ఎందుకు గడుపుతారు? అంటూ స్త్రీల స్వేచ్ఛను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. వీటిపై నెట్ జనులు తీవ్రంగానే స్పందించారు.

మహిళల హక్కులను భంగం కలించేందులా నేతలు వ్యాఖ్యలు చేసి పార్టీకి అపఖ్యాతి తీసుకురావడం సముచితం కాదని పలువురు నెట్ జనులు సూచించారు. రాత్రివేళ్లలో హర్యానా రోడ్లపై నడవరాదు.. కనీసం వాహనాలలో కూడా వెళ్లరాదు.. ఈ రోడ్లపై బీజేపి నేతల కుమారులు మాత్రమే మద్యం సేవించి తిరుగుతారు అని కొందరు వ్యంగంగా ట్విట్ చేశారు. మరికోందరు రఘువీర్ భట్టిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో బీజేపి అధ్యక్షుడి కుమారుడి వేధింపులను ఎదర్కోన్న ఐఏఎస్ అధికారి కూమార్తె వర్ణికా కుందు కూడా గట్టిగానే బదులిచ్చారు.

ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'అది ఆయన పని కాదు.. ఎక్కడ, ఏం చేయాలనేది నాకు సంబంధించిన విషయం నా కుటుంబానికి సంబంధించిన విషయం. రాత్రి పూట అలా జరిగితే అది నా తప్పా? రాత్రి పూట పురుషులు నియంత్రణలో ఉండరా? నన్నెందుకు అస్సలు ప్రశ్నిస్తున్నారు? నేను దాడికి గురైన బాధితురాలిని వారు నన్ను ప్రశ్నించకూడదు? ఇప్పుడు నన్ను నేను రక్షించుకున్నాను కాబట్టి ఏదో తప్పయి ఉంటుంది క్షమించండి అని అంటున్నారని అమె వివరించారు.

నిజానికి నాకు ఏదైనా అయి ఉంటే ఎవరికి వారు క్షమాపణలు చెబుతారు? అసలు వీరు సమాజాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఒంటిరిగా మహిళ కనిపించకూడదా? ఒంటరిగా ఉన్న మహిళ మద్యం సేవించకూడదా? రాత్రి ఒక మహిళ తన స్నేహితులైన అబ్బాయిలతో ఉండి మత్తులో ఉంటే ఇక ఆమె తనపై లైంగిక వేధింపులకు ఆహ్వానించినట్లా? అంటూ దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో కడిగి పారేశారు. కు వైపు సోషల్ మీడియా బాసటగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varnika Kundu  Subhash Barala  Vikas Barala  ramveer bhatti  BJP  haryana  

Other Articles