పవన్ కులం ఏంటో మరిచిపోయారా? | Mr Mudragada Pawan Also Belongs to Kapu Community

Cbn response on mudragada letter to pawan

Pawan Kalyan, Mudragada, Mudragada Letter Pawan kalyan, Pawan Kalyan Kapu or Not, Chandrababu Mudragada Pawan Letter, Pawan Mudragada, Pawan Kalyan Caste, Mudragada Pawan Caste, Kapu Agitation Pawan, Pawan Support Mudragada, Kapu Reservation Pawan, Pawan Krishnaiah, R Krishnaiah Kapu Reservation

AP CM Chandrababu Nadiu Angry over Mudragada Padmanabham Letter to Janasena Chief Pawan Kalyan. Mudragada remind Pawan Babu's Manifesto and don't Trust Chandrababu and Not support him in Open Letter. BC Leader R Krishnaiah Request Pawan to Re Think Kapu Reservation.

ఇంతకీ పవన్ కల్యాణ్ ది ఏ జాతి?

Posted: 08/02/2017 09:22 AM IST
Cbn response on mudragada letter to pawan

కాపు ఉద్యమం పేరిట చేయాలనుకున్న పాదయాత్రకు బ్రేక్ పడటం, హౌజ్ అరెస్ట్ నేపథ్యంలో ఇంటి నుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నాడు ముద్రగడ పద్మనాభం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఉచ్చులో చిక్కుకోవద్దంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశాడు కూడా. దీనిపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ లేఖలో ముద్రగడ ’మా జాతి’ అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడని సమాచారం. కాపులను బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. చంద్ర‌బాబుతో స్నేహం మంచిది కాద‌ని, టీడీపీ అధినేత‌తో స్నేహం చేసి ప‌ర‌ప‌తి పోగోట్టుకోవ‌ద్ద‌ని ముద్ర‌గ‌డ ప‌వ‌న్‌కు సూచించాడు. మంజునాథ కమిషన్‌ వేసి 18 నెలలు కావస్తున్నా... ఇంకా నివేదిక తెప్పించుకోలేదని ముంద్రగడ తెలిపాడు. చంద్ర‌బాబు మాట‌ల‌ను న‌మ్మి ఆయ‌న‌తో స్నేహం చేస్తే కాపులు క్ష‌మించ‌ర‌ని ప‌వ‌న్ గురించి ముద్ర‌గ‌డ కామెంట్ చేశాడు.

అయితే ముద్రగడ వాడిన భాష సమంజసంగా లేదని, తన కులానికి చెందిన వారిని కూడా మరిచి కామెంట్లు చేస్తున్నాడంటూ బాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం. 'పవన్ కల్యాణ్ ది ఏ జాతి?' ఆయనకు (ముద్రగడ) జాతికి చెందిన వాడేగా... అలాంటప్పుడు ఏం రాయలో అన్న అంశంపై అవగాహన కొరవడినట్లుంది అంటూ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇక లేఖలో రాసిన భాష చూస్తే, ఆయన ఎవరి తరపున పనిచేస్తున్నారో(పరోక్షంగా వైఎస్సార్సీపీ) తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు బెల్ట్ షాపుల మూసివేత, నిరుద్యోగ భృతి సమస్యలను కూడా ప్రస్తావనకు తెచ్చినట్లు సమాచారం.

 

పవన్ కాస్త ఆలోచించు...

కాపులను బీసీలలో కలపడం చట్ట విరుద్ధమని అంటున్నారు బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్యం. ఎవర్ని పడితే వారిని బీసీల్లో చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా? అని ప్రశ్నిస్తున్నాడు. తాను తెలంగాణలో బీసీ సీఎం అభ్యర్థిగా పోటీ చేశానని, ఏపీ టీడీపీ మేనిఫెస్టోను వ్యతిరేకించానని అప్పటి విషయాలను కృష్ణయ్య ప్రస్తావించాడు.  పేదలు అన్ని కులాల్లో ఉంటారని, పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని అన్నాడు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దీనిపై ఆలోచించాలని కోరాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu Reservation  Mudragada  Pawan Kalyan  Chandrababu Naidu  

Other Articles

 • Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

  చిదంబరం విషయంలో.. కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

  Aug 21 | ‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి... Read more

 • Inx media scam chidambaram might be arrested at any time

  ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం వుందన్న వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఇవాళ... Read more

 • Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

  భారత్ లోకి బికిని ఎయిర్ లైన్స్.. 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్..

  Aug 21 | భారత దేశ నుంచి మరో దేశం తమ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. వియత్నాంకు చెందిన వియత్ జట్ ఎయిర్ లైన్స్.. ఇండియా నుంచి తమ దేశంలోని ముఖ్యనగరమైన హో చి... Read more

 • Inx media scam chidambaram petition may not get cleared for hearing in sc

  చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ 23కు వాయిదా

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిదంబరం ఆ అజ్ఞాతం వీడక తప్పదనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలినట్టయింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు... Read more

 • Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

  ITEMVIDEOS: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

  Aug 21 | అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అక్కడి ఓ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించేందుకు నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో ఆయను నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన... Read more

Today on Telugu Wishesh