ఐదుగురి గ్యాంగ్ తో సుపారీ స్కెచ్.. ఆస్పత్రిలోనే విక్రమ్ గౌడ్ అరెస్ట్ | Congress Youth Leader Arrested in Fake Firing Case

Gun firing case vikram goud arrest

Vikarm Goud, Vikram Goud Arrest, Vikram Goud Fire Case, Vikram Goud Fake Drama, Hyderabad CP on Vikram Goud Case, Vikram Goud Arrest Press Meet, Vikram Goud Indore Batch, Supari Vikram Goud Case, Congress Youth Leader Vikram Goud, Vikram Goud Wife Arrest

Gun Firing Case Vikram goud Along with Convicts Arrested. Vikram hiring Gunmen to shoot at him. Police Arrested vikram at Apollo Hospital.

ఫేక్ డ్రామాలో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

Posted: 08/02/2017 10:32 AM IST
Gun firing case vikram goud arrest

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై కాల్పులు జరిగినట్లుగా డ్రామా క్రియేట్ చేసి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడే ప్రధాన నిందితుడని విచారణలో తేలటంతో కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11 మంది నిందితులు కాగా, విక్రమ్ తోసహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తనను పట్టుకోలేరని భావించిన విక్రమ్ గౌడ్ పక్కా ప్లాన్ ప్రకారం తనపై కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఆరు నెలల ముందే స్కెచ్ గీసిన విక్రమ్ షార్ప్ షూటర్ కు తానే ఆశ్రయమివ్వడం విశేషం. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, విక్రమ్ గౌడ్ గత చరిత్రను తవ్వితీస్తున్నారు. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో దందాలు, సెటిల్ మెంట్లు చేశాడని గుర్తించారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా, ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేయగా, ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా విక్రమ్ గౌడ్, ఏ2గా నందు, ఏ3గా అహ్మద్ ఖాన్ గా, ఏ4గా రాజశేఖర్ ను పేర్కొన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3గంటలకు ఈ వ్యవహారంపై కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్ నిర్వహించాడు.

స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే...

కాల్పులకు పాల్పడింది ఇండోర్ కు చెందిన సుపారీ గ్యాంగ్ అని బంజారా హిల్స్ పోలీసులు తేల్చి చెప్పారు. సుపారీ గ్యాంగ్ తో కాల్పులకు ఆరు నెలల నుంచి విక్రమ్ ప్లాన్ చేశాడని, నిపుణుడైన ఓ షూటర్ ని ఎంపిక చేసుకుని కాల్పులకు పథకం వేసుకున్నాడని పోలీసుల సమాచారం. కాల్పులు జరిపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని భావించిన విక్రమ్ తన ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడని సమాచారం. ఈ కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ఆ నిపుణుడైన షూటర్ సహా మరో ఇద్దరు ఇక్కడికి వచ్చి వెళ్లారని, కాల్పులు ఎక్కడ జరపాలి, శరీరంపై ఎక్కడ గాయపర్చాలనే విషయమై విక్రమ్ ఓ ట్రయల్ రన్ వేశాడని పోలీసులు పేర్కొన్నారు.

మూడు రౌండ్ల కాల్పులు జరపాలని సదరు షూటర్ కు విక్రమ్ చెప్పాడని, కాల్పులు జరిపాక ఏ మార్గంలో పారిపోవాలో విక్రమ్ స్కెచ్ వేసి ఇచ్చాడని, సీసీ కెమెరాలు లేని రూట్ ను నిందితులకు విక్రమ్ చూపించాడని సమాచారం. అయితే, రెండు రౌండ్ల కాల్పులకే భయపడిపోయిన సదరు షూటర్, మూడో రౌండ్ కు ముందే పారిపోయాడని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి సిటీ బయటకు నిందితులు పారిపోయారని, వారిలో నిపుణుడైన షూటర్ ఇండోర్ కు, మరో ఇద్దరు అనంతపురం, ఇంకొకరు బెంగళూరుకు పారిపోగా, మూడు ప్రాంతాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ కేసులో 120,120 బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Leader  Vikram Goud  Gun Firing Case  

Other Articles