AP minister lokesh sensational comments of left parties అరుణపతాకపార్టీపై చిన్నబాబు ఘాటు వ్యాఖ్యలు..

Ap minister lokesh satirical comments of left parties

nara lokesh satirical comments on left parties, lokesh sensational comments of left parties, nara lokesh, ap minister, left parties, vijayawada, kapus, mudragada padmanabham, cpi, cpm, tdp, politics, political news

Andhra Pradesh minister nara lokesh babu sensational satirical comments on left parties says, if chance comes they will make disturbances between him from his father

అరుణపతాకపార్టీపై చిన్నబాబు ఘాటు వ్యాఖ్యలు..

Posted: 07/27/2017 02:04 PM IST
Ap minister lokesh satirical comments of left parties

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ధేశకులని విశ్వసించి.. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుణ పతాక పార్టీలపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాపపక్షాల హాయంలో విజయవాడ అభివృద్ది జరిగిందన్నది వాస్తవం కాదని, విజయవాడ అసలైన అభివృద్ది తమ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లెప్ట్ పార్టీలకు చాన్స్ వస్తే తనకు.. తన నాన్న చంద్రబాబుకు మధ్య కూడా గోడవలు సృష్టిస్తారని అన్నారు. ప్రతిపక్షాలు ధర్నాలకు పిలుపునిస్తే ప్రజలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆంద్రులకు తెలుగుదేశం పార్టీ తీసుకువస్తుస్న ప్రజాహిత కార్యక్రామాలు అకర్షిస్తున్నాయి కాబట్టే ప్రతిపక్షాల వైపు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారి కానీ ప్రతిపక్షాలకు కదాని లోకేస్ అన్నారు. కాపులకు అన్ని చేస్తున్న చంద్రబాబును ఎందుకు తిడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

కాపులకు మంచి పనులు చేస్తున్న తమను తిట్టిపోస్తూ.. ఏమీ చేయని వాళ్లు విద్వేషాలకు మాత్రం ఆ సామాజికవర్గం వారు లోంగిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని, అయినా ఎవరైనా వాడితే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  ap minister  left parties  vijayawada  kapus  mudragada padmanabham  cpi  cpm  tdp  politics  

Other Articles