Really! US and China Mediate in Kashmir Conflict

Us and china should be asked to mediate in kashmir conflict

Kashmir Struggle, Farooq Abdullah, Farooq Abdullah US and China Mediate, US and China Mediate Kashmir, Kashmir Issue, Kashmir Conflict, Farooq Abdullah Comments, Farooq Abdullah Controversy Comments

Jammu and Kashmir Former Chief Minister Farooq Abdullah on Friday allegedly said it is time India approaches a third party like China or the United States to referee the Kashmir conflict.

మాజీ ముఖ్యమంత్రి మళ్లీ నోరుజారాడు

Posted: 07/22/2017 09:07 AM IST
Us and china should be asked to mediate in kashmir conflict

దశాబ్దాలుగా రగులుతున్న ఏకైక సమస్య కశ్మీర్‌ పై మాట్లాడేందుకు నేతలెవరూ సాహసించరు. అయితే ఆ ప్రాంతానికే చెందిన వాళ్లు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలే చేస్తుంటారు. రీసెంట్ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ ఎంపీగా ఈ మధ్యే ఎంపికైన ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ‘మూడో వ్యక్తి’ జోక్యం అవసరమని కామెంట్ చేశాడు.

సుదీర్ఘంగా పరిష్కారం కాని ఈ జఠిల సమస్యను మధ్యవర్తిత్వంతోనే పరిష్కరించవచ్చని స్పష్టం చేశాడు. ఈ విషయంలో అమెరికా, చైనాలు ముందుకు వచ్చినా భారతే స్పందించడం లేదని ఆరోపించాడు. పాక్ దగ్గర అణుబాంబులున్నాయి, భారత్ వద్ద కూడా అణుబాంబులున్నాయి. దీని వల్ల ఎంత మంది చనిపోవాలంటూ ఆయన రెచ్చగెట్టే వ్యాఖ్యలే చేశాడు. ఆయన ఆ రెండు దేశాలను మధ్యవర్తిత్వానికి ఆహ్వానిస్తున్నట్టుగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కాగా, కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఏనాడూ ప్రకటించనప్పటికీ ఐక్యరాజ్యసమితిలోని యూఎస్‌ రాయబారి నిక్కీ హెలీ ఏప్రిల్‌ లో చేసిన వ్యాఖ్యలు ఆయన మధ్యవర్తిత్వానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. డోక్లాం వివాదం నేపథ్యంలో పాక్ తరపున యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు దేశాలు కశ్మీర్ అంశంపై మద్యవర్తిత్వం వహిస్తామని చెప్పనప్పటికీ ఫరూక్ అనవసరంగా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir  US and China Mediate  Farooq Abdullah  

Other Articles