B.Tech student Dinesh Commits Suicide In KPHB కేపీహెచ్ బీ లో ఘోరంగా బలవనర్మణం.. అనుమానాలు..

Dinesh commits suicide in kphb colony police suspects love failure

student Commits Suicide, B.Tech student commits suicide, student dinesh commits suicide, suicide at malaysian township, suicide at kphb colony, nellore student suicide in hyderabad, dinesh, suicide, malaysia township, kphb, love affair, love failure, hyderabad, telangana, crime

A B.Tech student Dinesh, who belongs to nellore district of andhra pradesh, Commits Suicide In malaysian township of KPHB Colony, Police Suspects Love Failure

కేపీహెచ్ బీ లో బీటెక్ విద్యార్థి బలవనర్మణం.. అనుమానాలు..

Posted: 07/22/2017 10:46 AM IST
Dinesh commits suicide in kphb colony police suspects love failure

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు పరిధిలోని మలేషియా టౌన్ షిప్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువకుడు కనివీని ఎరుగని రీతిలో అత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు పార్క్‌ చేసి ఉన్న తన కారులోనే.. ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్ లీక్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే యువకుడు ఎప్పుడు అత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం మాత్రం తెలియరాలేదు.

మలేషియా టౌన్ షిప్ వాసులు పార్క్‌ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్ గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా దినేష్ అత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కారులోని గ్యాస్ ను లీక్ చేసిన తరువాత.. తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకుని మరణించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిన క్రమంలో తన ముఖానికి వున్న కవర్ ను తీయకుండా వుండిపోవడం.. ప్రయత్నాలు చేయకపోవడంతో సందేహాలకు తావిస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dinesh  suicide  malaysia township  kphb  love affair  love failure  hyderabad  telangana  crime  

Other Articles