Mayawati's resignation from Rajya Sabha accepted అనుకున్నదే జరిగింది.. అధినేత్రి రాజీనామా అమోదం..

Mayawati s resignation accepted after handwritten note to vice president

Mayawati, Parliament, Rajya Sabha, resignation, dalit attacks, vice president, hamid ansari, Bahujan Samaj Party, kurian, BJP

Bahujan Samaj Party chief Mayawati's resignation was accepted today after she met Vice President Hamid Ansari, the chairman of the Rajya Sabha, with a second letter, a one-line handwritten note.

అనుకున్నదే జరిగింది.. అధినేత్రి రాజీనామా అమోదం..

Posted: 07/20/2017 02:13 PM IST
Mayawati s resignation accepted after handwritten note to vice president

అనుకున్నదే జరిగింది.. బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజీనామాను రాజ్యసభ అమోదించింది. పెద్దల సభలో దళితులపై దాడులు జరుగుతున్న అంశాన్ని చర్చించేందుకు తనకు సమయాన్నికేటాయించాలని లేని పక్షంలో రాజీనామా చేస్తానని చెప్పిన ఆమె.. అన్నంత పని చేశారు. మంగళవారం సాయంత్రం అమె తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. దళిత వర్గానికి నేతృత్వం వహిస్తూ.. వారిపై జరుగుతున్న దాడులను సభలో ప్రస్తావించే అవకాశం లేకుండా చేస్తే.. ఇక తాను సభలో వుండి ఎం లాభం అని.. అమె రాజీనామా చేశారు.

ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తేందుకు మాయావతి ప్రయత్నించగా.. ఉప సభాపతి అడ్డుకున్నారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన అమె.. రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడేందుకు అనుమతించడం లేదని అరోపిస్తూ.. రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అదే విధంగా అమె తన రాజీనమాను ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీకి కూడా పంపించారు. అయితే అమె రాజీనామాను వెనక్కు తీసుకోమ్మని ఉపరాష్ట్రపతి విన్నవించినా అమె వెనక్కు తగ్గలేదు.

కాగా ఏకవాఖ్య రాజీనామా పత్రాన్ని సమర్పించాలని ఉపరాష్ట్రపతి మాయావతిని కోరడంతో అమె తన చేతి రాతతో కూడిన ఏకవ్యాఖ్య రాజీనామాతో రాజ్యసభ సభాపతిని కలిసి రాజీనామాను సమర్పించారు.  దీంతో మాయవతి రాజీనామాను అమోదిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. అయితే మాయావతి రాజీనామా వెనుక భారీ వ్యూహమే వున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్ పూర్‌ లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్సీ, సహా మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayawati  Parliament  Rajya Sabha  resignation  dalit attacks  vice president  hamid ansari  

Other Articles