Naidu not worried on Venkaiah as VP

Telugu cm hails venkaiah s vp candidature

Chandrababu Naidu, Venkaiah Naidu Vice President of India, Venkaiah Naidu Gopala krishna Gandhi, NDA VP Post Candidate, Vice President Election Method, Vice President Candidates Officials, Vice President Elections 2017

AP Chief Minister Chandrababu hails Venkaiah's candidature for Vice President post. Venkaiah’s elevation not a problem for state he added.

వెంకయ్య జీ.. ఇక రాజకీయాలు వద్దు!

Posted: 07/18/2017 10:06 AM IST
Telugu cm hails venkaiah s vp candidature

అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి బరిలోకి వచ్చిన వెంకయ్యనాయుడు తన పదవులకు రాజీనామా చేసేశాడు. ఎన్డీయే పక్షాల తరపున వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్నారని వార్తలు ముందస్తుగానే హల్‌చల్ చేశాయి. అయితే వెంకయ్య ఆ వార్తలను ఖండించాడు. ఆపై హస్తిన అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసర సమావేశం అనంతరం వెంకయ్య పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు.

ఆఫై రాత్రికి గ్రామీణాభివృద్ధి, సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ పదవులకు రాజీనామా చేయగా, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేశారు. బీజేపీ తనకు తల్లి వంటిదని, ఇప్పుడు అమ్మను వదిలేస్తున్న బాధ కలుగుతోందని ఆయన పేర్కొన్నాడు. ఇక వెంకయ్య అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఎన్టీయే కన్వీనర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఎన్నో దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తూ, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వెంకయ్యనాయుడు, ఇప్పుడిక ఉపరాష్ట్రపతిగా రాజకీయాలకు దూరం కావడం కాస్తంత కష్టమైన పనేనని చంద్రబాబు వ్యాఖ్యానించాడు.

ఆయన(వెంకయ్య) జీవనమంతా రాజకీయాలే కావడంతో, ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకోవడం కష్టమేనని పేర్కొన్నాడు. ఇకపై రాజకీయాలు మాట్లాడకుండా ఆయన కంట్రోల్ గా ఉండాలని సూచించాడు. రాష్ట్రానికి వెంకయ్య దూరమవుతారన్న ఆలోచన బాధను కలిగిస్తోందని, ఇదే సమయంలో అభివృద్ధి విషయంలో మాత్రం నష్టం కలుగబోదనే భావిస్తున్నట్టు తెలిపాడు. తన ముందున్న పెద్ద పరీక్షలో వెంకయ్యనాయుడు ఉత్తీర్ణుడవుతాడన్న నమ్మకం తనకుందని గెలుపు పై ధీమా వ్యక్తం చేశాడు. ఇక అద్వానీ సహా సీనియర్ నేతలను కలిసిన తర్వాత నామినేషన్ వేసేందుకు వెంకయ్య బయలుదేరాడు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ లు మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Venkaiah Naidu  Vice President Elections  

Other Articles