ఫుడ్ లో మత్తు మందు.. కబడ్డీ ప్లేయర్ రేప్.. నిందితుడు ఓ టాప్ అథ్లెట్ ?| National-Level Kabaddi player Alleges Raped

Young kabaddi player raped by

Kabaddi Player Rape, Athlete Rape Allegations, Indian Athlete Rape, National Level Player Rape, Athlete Rape Allegations, Kabaddi Player Arrest Rape, Indian Young Athlete Rape

A 16-year-old girl who claims to be a national-level kabaddi player has alleged that she was raped by an athlete on July 9. The girl, a resident of north Delhi, claimed she wasn’t conscious when the incident happened. “She said she only recalls seeing a huge room. She doesn’t know where exactly it happened,” said North Delhi Police according to complaint.

దారుణం: నేషనల్ ప్లేయర్ ను రేప్ చేశాడు

Posted: 07/18/2017 09:33 AM IST
Young kabaddi player raped by

దేశరాజధాని ఢిల్లీలో మరో ఘటన కలకలం రేపింది. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా రాణిస్తున్న 16 ఏళ్ల క్రీడాకారిణి, తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పేరున్న క్రీడాకారుడే (35-40 ఏళ్ల మధ్య వయసు) తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించటం సంచలనంగా మారింది.

ఈ నెల 9వ తేదీన, ఓ క్రీడాకారుడు తనకు ఆహారం పానీయం ఇచ్చాడని, అది తీసుకున్నాక తాను స్పృహ కోల్పోగా, ఆపై ఈ ఘటన జరిగిందని తెలిపింది. అయితే తనకు ఏం జరిగిందో గుర్తు రావడం లేదని, ఓ పెద్ద గదిలో తాను అత్యాచారానికి గురైనట్టు వెల్లడించింది. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్త్ ఢిల్లీ పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

సదరు ఆటగాడు, బాధితురాలిని కారులో ఛత్రసల్‌ మైదానం నుంచి తీసుకెళ్లాడని తేల్చారు. ఆపై జూలై 10న ఆమెను ఓ బస్టాండ్‌ వద్ద వదిలేశాడని అధికారులు తెలిపారు. నిందితుడు బెదిరించటంతో తొలుత జరిగిన దురాగతాన్ని ఎవరికైనా చెప్పేందుకు భయపడ్డానని, చివరికి పోలీసులను ఆశ్రయించానని ఆమె పేర్కొంది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Delhi  Kabaddi Player  Rape Allegations  

Other Articles