Drugs case: Tollywood stars to attend before SIT డ్రగ్స్ కేసు: విచారణకు హాజరుకావాల్సిందే: ఎవరెవరు ఎప్పుడు..!

Drugs case tollywood stars to attend before sit

puri jagannath, charmi, nandu, navdeep, mumaith khan, Tarun, chota k shyam, kelvin, drugs case, drugs racket, telangana government, telangana excise departmenrt, akum sabarwal, crime

The tollywood celebrities who have received notices from Telangana Excise police in the drugs case are to attend before SIT to give their statements.

డ్రగ్స్ కేసు: విచారణకు హాజరుకావాల్సిందే: ఎవరెవరు ఎప్పుడు..!

Posted: 07/17/2017 08:37 PM IST
Drugs case tollywood stars to attend before sit

టాలీవుడ్ లో అల‌జ‌డి రేపుతున్న డ్రగ్స్ కేసును తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు మరింత వేగం పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాల్ కు ఫోన్ చేసి ఈ కేసులో విషయానలు దాయడం సబబు కాదని, ఎంతటి ప్రముఖులు వున్నా.. నిర్థారణ చేసుకున్న వెంటనే వాటిని మీడియాలో తెలియజేయాలని అదేశించిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగిరం చేశారు. ముందుగా సెలవు పై వెళ్లాలని అనుకున్న అధికారి సబర్వాల్.. తన లీవ్ ను రద్దు చేసుకుని మరీ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తున్నారని నిర్థారణ అయిన తరువాత కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు పంపిన ఎక్సైజ్ శాఖ.. ఈ కేసులో వున్న మరికొందరికి కూడా తాజాగా నోటీసులను అందించింది. తమ నోటీసులు అందుకున్న ప్రముఖులందరూ ఈ నెల 19 నుంచి అగస్టు 3 వరకు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని అదేశాలను జారీ చేసింది. ఈ కేసుతో సంబంధమున్న ఒక్కోక్క సెలబ్రిటి ఒక్కో రోజున ఉదయం ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు వారికి జారీ చేసిన నోటీసులలో పేర్కోన్నారు.

ఈ కేసులో ద‌ర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్ కి కూడా ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 19న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని అందులో పేర్కొన్నారు. తొలి రోజునే పూరీ జ‌గ‌న్నాథ్‌ను విచారిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. కాగా 20వ తేదీన హీరోయిన్ ఛార్మీ, 21న నటి మొమైత్‌ ఖాన్‌, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరా మ్యాన్‌ శ్యాం కే నాయుడు సిట్‌ ఎదుట హాజరై తమకు డ్రగ్స్ తో వున్న సంబంధాలపై వివరణను ఇవ్వనున్నారు.

మాస్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ఎదుట హాజరకానున్నారు. ఆయన తల్లి, స్నేహితుడు రవితేజకు డ్రగ్స్ తో సంబంధం లేదని, అతనితో భరత్ ను పోల్చవద్దని వాఖ్యలు చేసినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి 24న తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. ఈ నెల 25న ఆర్ట్‌ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్‌, 27న హీరో తరుణ్‌, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. పేరు మోసిన డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ కాల్ లిస్ట్‌ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  drugs case  akun sabarwal  excise department  telanagana government  

Other Articles