Putin wants Hillary Clinton as US President

Trump not in putin mind only hillary

Donald Trump, Trump Impeachment, Putin Wants Hillary Clinton Victory, Hillary Putin, Putin Secret Interview, Democratic Party Impeachment, Democratic Candidate American Congress

Donald Trump reveals that once Russia President Putin wants Hillary Clinton Victory. If she came into power US army automatically weakened.Russia probe: Democratic congressman files Impeachment Petition.

పుతిన్ మనసులో అసలు ట్రంప్ లేడా?

Posted: 07/14/2017 09:29 AM IST
Trump not in putin mind only hillary

రష్యాతో కుమ్మకై తనను ఓడించారని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హిల్లరీ క్లింటన్ ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అగ్ర రాజ్య దేశ రహస్యాలను లీక్ చేశాడని, ప్రతిగా వాళ్లు ఎన్నికల్లో పరోక్షంగా ట్రంప్ గెలుపు కోసం కృషి చేశారంటూ తర్వాత కూడా ఆమె అనేకసార్లు విరుచుకుపడింది. అయితే వాటికి చెక్ పెడుతూ పుతిన్ ఓ ప్రముఖ మాగ్జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి హల్ చల్ చేస్తోంది.

నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారంట. ఆమెకు అధికారం వస్తే అమెరికా బలహీనమవుతుంది, అది తమకే అనుకూలంగా మారుతుందని అంచనా వేశాడంట. ఈ విషయాలను ఓ ప్రభుత్వ మాగ్జైన్ ప్రచురించగా, ఆ కథనం లీక్ అయ్యింది. అయితే తాను ఊహించినట్లు జరగకపోయినప్పటికీ, మిగతా దేశాలతో మైత్రి కొనసాగిస్తూ.. శాంతి నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తర్వాత ఆయన అదే సంచికకు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడంట.

ఈ విషయాన్ని జీ-20 భేటీలో ట్రంప్ వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. తను, పుతిన్‌ తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ‘మా సైన్యం బలోపేతానికి నేను అధికశ్రద్ధ చూపాను. హిల్లరీ అధికారంలోకి వచ్చి ఉంటే సైన్యం బలహీనంగా మారేది. ఇంధనం ధర మరింత పెరిగేది. అందుకే పుతిన్ నన్ను వ్యతిరేకించారు’అని ట్రంప్ తెలిపాడు.


అభిశంసనకు తీర్మానం
రష్యా జోక్యంతో అమెరికా ఎన్నికల్లో గెలిచి, తమ దేశ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించాడని డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తుంది. ట్రంప్‌ను తొలగించాలని కోరుతూ ఎంపీ బ్రాడ్‌ షెర్మన్‌ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్‌ సభ్యుడు అల్‌ గ్రీన్‌ దీనిపై సంతకం చేశారు. అయితే, కాంగ్రెస్ లో డెమొక్రట్లకు తగిన మెజారిటీ లేకపోవటంతో ఇది వీగిపోయే అవకాశం ఉంది. కాగా, అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  Donald Trump  Secret Interview  

Other Articles

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

 • Narrow escape for minister jogu ramanna from fire accident

  మంత్రి జోగు రామన్నకు తృటిలో తప్పిన ముప్పు..

  Feb 17 | తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనతో పాటు వున్న ఎమ్మెల్యే దివాకర్‌రావుకు కూడా ముప్పు తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో వారికి ఎలాంటి ప్రాణాపాయం... Read more

 • Heroic indian origin teacher saved many during florida shooting

  ఆ లెక్కల టీచర్ కూడికలే ప్రాణాలను కాపాడాయి..

  Feb 17 | అమె లెక్కల టీచర్., విద్యార్ధులకు అవసరంగా అన్ని లెక్కల్ని నేర్పిస్తారు. అదే తన ప్రాణాలపైకి వస్తుందన్న తరుణంలో తన కోసం ఎవరినైనా బలిపెడతాగు. అంటే తీసివేతలు. కానీ ఇక్కడ ఈ భారతీయ టీచర్ శాంతి... Read more

 • Jfc second day meeting padmanabhaiah to preside meeting

  ITEMVIDEOS: పద్మనాభయ్య అధ్యక్షతన జేఎఫ్సీ రెండో రోజు సమావేశాలు

  Feb 17 | జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు,... Read more

Today on Telugu Wishesh