Intelligent Monkey Request for Treatment

Monkey ask for treatment help to hospital staff

Monkey, Uttarakhand, Uttarakhand Monkey, Monkey in Hospital, Monkey Ask First Aid, Monkey treatment, Uttarakhand Monkey Video, Monkey Hospital Viral Video

Monkey reaches hospital with injured leg in Pauri Garhwal district Uttarakhand. receive treatment also food from staff here is the video.

ITEMVIDEOS:ప్లీజ్.. నాకు ట్రీట్ మెంట్ చేయండి

Posted: 07/14/2017 10:09 AM IST
Monkey ask for treatment help to hospital staff

ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరైనా ఏం చేస్తాం. మందులేసుకుంటాం.. మరీ ఎక్కువైతే ఆస్పత్రికి వెళ్తాం. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? పెంపుడు జంతువులైతే యజమానులు వాటికి వైద్యం చేయిస్తారు. కానీ, ఏ జంతువూ త‌న‌ంతట తానుగా ఆసుప‌త్రికి వెళ్ల‌లేదు కదా. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఘటన మిమల్ని కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ వానరం త‌న‌కు తానుగా ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది.

పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ ఆసుప‌త్రిలోకి ఓ కోతి ఎంటర్ అయ్యింది. అక్క‌డ ఆ స‌మ‌యానికి వైద్యుడు లేక‌పోవ‌డంతో టేబుల్‌పై కాసేపు పడుకుంది. ఇంతలో అక్కడ కూర్చున్న ఓ వ్యక్తికి తన కాలికి అయిన గాయాన్ని పదే పదే చూపించి సాయం కోరింది. దీంతో అతను దానికి అరటి పండ్లు పెట్టాడు. అవి తిన్నాక నీరు అందించేందుకు యత్నించగా, వద్దంటూ పక్కే ఉన్న సెలైన్‌ బాటిల్ తీసుకుని తాగేసింది.

 

ఇలా మరో లేడీ నర్స్ సాయంతో ఓ మూడు బాటిళ్లను గటగటా తాగేసి మూడు గంటలపాటు అక్కడే రెస్ట్ తీసుకుంది. ఆపై ఎనర్జీ రావటంతో తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. దానిని చూసేందుకు చాలా మంది ఎగబడిపోయారు. అయినా అదేం కంగారు పడకుండా కూల్ గా ఉండిపోయింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand  Monkey Treatment  Hospital  Viral Video  

Other Articles