Rana seeks action against Imran Ansari ‘‘చంపి పాతరేస్తా’’ అన్న మంత్రిపై చర్యలకు డిమాండ్

Devender rana seeks action against imran ansari over lynching threat

GST, Davender Rana, Kashmir assembly, Imran Ansari, lynching remarks, pdp legislator, sports minister, provincial president, NC, Politics

Provincial President of National Conference and MLA Nagrota Devender Rana on Wednesday sought action against PDP legislator and Sports Minister Imran Ansari for his lynching remarks

‘‘చంపి పాతరేస్తా’’ అన్న మంత్రిపై చర్యలకు డిమాండ్

Posted: 07/05/2017 01:33 PM IST
Devender rana seeks action against imran ansari over lynching threat

అసెంబ్లీ అంటే చట్టసభ. అలాంటి చట్టసభ సాక్షిగా.. అధికార పక్షానికి చెందిన సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏకంగా అబాసుపాలు చేస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడుని సభలోనే చంపిపారేస్తానని హెచ్చరించారు. ఐదేళ్లకో పర్యాయం ప్రజల ఓట్ల ద్వారా నెగ్గి చట్టసభల్లోకి వెళ్లే సభ్యుడు.. చట్టసభనే అవహేళన చేసే విధంగా ప్రపర్తిస్తూ.. ప్రజాస్వామ్యానికి అపఖ్యాతిని అంటగడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకాశ్మీర్ మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చట్టసభలోనే చంపి పాతరేస్తానంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో.. సభలో తీవ్ర గంధరగోళ పరిస్థితులు తలెత్తాయి. తక్షణం మంత్రి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షానికి చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమలవుతున్న క్రమంలో జమ్మూకాశ్మీర్ లో మాత్రం జీఎస్టీ విధానాన్ని ఎందుకు అముల చేయడంలేదన్న విషయమై అసెంబ్లీలో జరిగిన చర్చ చివరకు వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. అయితే మంత్రి వ్యాఖ్యలకు నోచ్చుకున్న స్పీకర్ వెంటనే మంత్రి తరపున క్షమాపణలు చెప్పారు.

దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానాన్ని అమలుపరుస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదని, అసలు జీఎస్టీ బిల్లును అధికార పక్షం అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధికార పక్షం నుంచి అయన మాట్లాడుతున్నంత సేపు పన్నులు ఎగ్గోట్టిన వారే జీఎస్టీ అమలు గురించి అడుగుతున్నారంటూ అరోపణలు వినిపించాయి.

వాటిపై ఆయన బదులిస్తూ తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని తాను తలుచుకుంటే దేవేందర్ రాణాను ఇక్కడే చంపేయగలను అని బెదిరించారు. ఆయన దొంగ వ్యాపారాలన్నీ తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలో రాణా కంటే పెద్ద దొంగ ఎవరూ లేరని విమర్శించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బేషరుతు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా రాణా మాత్రం మంత్రి అన్సారీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST  Davender Rana  Kashmir assembly  Imran Ansari  lynching remarks  Politics  

Other Articles