Indian-Origin Boy Arnav Most Intelligent in World

Indian origin kid has higher iq than intellectuals

Indian-Origin Boy IQ, Albert Einstein Stephen Hawking, Einstein Hawking IQ test, Arnav Sharma IQ, Arnav Sharma Hawking, Arnav Sharma Einstein, Indian-Origin Boy Intelligence, Arnav Parents

Indian Origin Boy gets higher score than Albert Einstein and Stephen Hawking on IQ test. 11-year-old secures 162 points on Mensa IQ test, higher than those intellectuals.

ఐన్ స్టీన్, హాకింగ్ వల్లే కాలేదు కానీ...

Posted: 06/30/2017 03:09 PM IST
Indian origin kid has higher iq than intellectuals

శాస్త్రవేత్తలుగా, భావితరాలకి మార్గదర్శకులుగా ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లు చరిత్రలో నిలిచిపోయారన్న దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వీల్ చైర్ లో ఉంటూ కూడా ఖగోళ శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న స్టీఫెన్ హాకింగ్ లైఫ్ చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది కూడా. అయితే మాములు వ్యక్తుల కన్నా వీళ్ల ఐక్యూ(మేధాశక్తి) కాస్త ఎక్కువే. ప్ర‌పంచంలో అతి క‌ష్ట‌మైన మెన్సా ఐక్యూ టెస్ట్‌లో మొన్నటిదాకా వీరిద్దరి పేర్లే ఇప్పటిదాకా టాప్ ప్లేస్ లో ఉన్నాయి కూడా. కానీ, ఆ రికార్డును కూడా తుడిచిపడేశాడు 11 ఏళ్ల ఓ కుర్రాడు.

ఇంగ్లండ్‌కు చెందిన‌ ప‌ద‌కొండేళ్ల భార‌త సంత‌తి బాలుడు అర్న‌వ్ శ‌ర్మ, ప్ర‌పంచంలో అతి క‌ష్ట‌మైన మెన్సా ఐక్యూ టెస్ట్‌లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇలా అలా కాదు.. ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే రెండు మార్కులు ఎక్కువే తెచ్చుకున్నాడు. పైగా ఈ పరీక్ష కోసం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే అర్న‌వ్ 162 మార్కులు తెచ్చుకోవటం విశేషం. సౌత్ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌ టౌన్ లో నివ‌సించే అర్న‌వ్ అతిక‌ష్ట‌మైన వెర్బ‌ల్ రీజ‌నింగ్ ఎబిలిటీ ప‌రీక్ష‌ను సులువుగా పాసయ్యాడు.

Arnav Sharma IQ

సుమారు రెండున్న‌ర గంట‌ల‌పాటు జ‌రిగిన ఈ ప‌రీక్ష‌ను అర్న‌వ్‌తో పాటు ఎనిమిది మంది రాశారు. వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే చిన్న‌పిల్ల‌లని అర్న‌వ్ చెప్పాడు. `ప‌రీక్ష రాస్తున్న‌పుడు అర్న‌వ్ అస‌లు కంగారు ప‌డ‌లేదు. చాలా కూల్‌గా రాశాడు. బ‌య‌ట ఉన్న నేను మాత్రం చాలా కంగారు ప‌డ్డాను` అని అర్న‌వ్ త‌ల్లి మీశా ద‌మీజా శ‌ర్మ తెలిపింది. అర్న‌వ్ కి రెండేళ్ల వ‌య‌సు ఉన్నప్పటి నుంచే గ‌ణితంలో మంచి ప్ర‌తిభ చూపించాడని ఆమె చెబుతోంది.

ఎక్కువ ఐక్యూ ఉన్న‌వాళ్ల‌ని గుర్తించ‌డానికి 1946 నుంచి మెన్సా టెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నారు. దీన్ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త లాన్స్‌లెట్ లియోన‌ల్ వేర్‌, ఆస్ట్రేలియాకు చెందిన లాయ‌ర్ రోలాండ్ బెర్రిల్‌లు రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Albert Einstein  Stephen Hawking  Mensa IQ test  Arnav Sharma  

Other Articles