Undavalli Only Bhajana Not Join Jagan's Party

Why undavalli not join ysrcp

TDP MLC Buddha Venkanna, Undavalli Jagan Bhajana, Undavalli Arun Kumar, Undavalli BJP, Undavalli Jagan CM, Jagan Undavalli, Undavalli Arun Kumar Political Carrier End, TDP MLC Fire Undavalli, Undavalli Buddha Venkanna, Undavalli YSRCP BJP

TDP MLC Buddha Venkanna Fire on Undavalli Arun Kumar's Jagan Future CM Comments. Asked Former MP Why he not join YSRCP till Now.

ఉండవల్లి వైసీపీలోకి ఎందుకు వెళ్లడు?

Posted: 06/30/2017 12:49 PM IST
Why undavalli not join ysrcp

రాష్ట్ర విభజన సమయంలో అడ్డుపుల్ల వేసిన నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. సమైక్యాంధ్ర నినాదంతో కిరణ్ కుమార్ రెడ్డి టీంతో చేతులు కలిపిన ఆయన తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. అయితే రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి తన కేసును తానే వాదించుకుని భంగపడ్డ ఆయన తర్వాత తెరచాటుకు వెళ్లిపోయారు.

ఇక మధ్య మధ్యలో మీడియా ముందకు వచ్చి టీడీపీని, చంద్రబాబు నాయుడును ఏకీ పడేస్తున్న ఆయన ప్రతిపక్షంలో చేరుతారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. పైగా వైఎస్ తో సాన్నిహిత్యం మూలంగా జగన్ కూడా అడ్డుచెప్పడనే అంతా భావించారు. కానీ, ఆ వార్త గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతాడంటూ ఉండవల్లి పదే పదే జోస్యం చెబుతుండటంతో... టీడీపీ నేతలు గట్టి కౌంటరే ఇస్తున్నారు.

ఉండవల్లికి నిజంగా జగన్ పై ప్రేమ ఉంటే వెంటనే వెళ్లి వైకాపాలో చేరాలని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సలహా ఇచ్చాడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కక్ష సాధింపు ధోరణిలో విమర్శలు చేస్తున్నాయని, ఇక ఉండవల్లి వంటి ఏ పార్టీకీ చెందని నేతలు తమ భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి భజనలకు దిగుతున్నారని మండిపడ్డాడు. వైఎస్ జీవించి వుంటే, 2011లోనే పోలవరం పూర్తయి ఉండేదని చెప్పడం ఉండవల్లి అజ్ఞానానికి నిదర్శనమన్నాడు. అమరావతి నిర్మాణానికి రుణం అవసరం లేదని వైకాపా ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయడం, అలాంటి వాళ్లకు ఉండవల్లి లాంటి జాతీయ రాజకీయాల అనుభవం ఉన్న వాళ్లు మద్ధతు ఇవ్వటం విడ్డూరంగా ఉందని బుద్ధా పేర్కొన్నాడు.

అయితే ఉండవల్లి చేరకపోవటం వెనుక పెద్ద మతలబే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అవకాశం ఉన్నా వైసీపీలో చేరకుండా ఉండవల్లి జాప్యం చేయటం వెనుక బీజేపీ గేమ్ ఫ్లాన్ ఉందన్నది వారు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavalli Arun Kumar  YS Jagan  Buddha Venkanna  

Other Articles