Tejaswini testifies in Sirisha death case శిరీష కేసులో తేజస్వినీ వాంగ్మూలం ఇదే..

Tejaswini testifies in sirisha death case

Tejaswini testifies in Sirisha death case, Tejaswini testifies, Beautician Sirisha Suicide Case, Shirisha murdered alleges relavtives, Kukunoorpally Mystery, Kukunoor SI, Kukunoorpally Sirisha, Kukunoorpally PS Sravan Rajeev, Rajeev Sravan Sirisha, Rajeev kill Sirisha, Sirisha Rape and Kill, Beautician Sirisha Case Details, shirisha, beautician, RJ photography, rajeev kumar, sravan, si prabhakar reddy, kukumoorpally, dcp venkateshwar rao, crime

Another key person in sirisha death case, Tejaswini records her statement in regard with the case, she accuses rajeev kumar has cheated her.

శిరీష కేసులో తేజస్వినీ వాంగ్మూలం ఇదే..

Posted: 06/27/2017 05:09 PM IST
Tejaswini testifies in sirisha death case

బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి కేసులో అసలు సమస్యకు కారణమైందని అరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తేజస్విని తొలిసారిగా స్పందించారు. ఎవరికి వారు నిర్ధోషులమని, తమకు శిరీషపై ఎలాంటి కోపం లేదని బాహటంగా చెప్పుకుంటున్న క్రమంలో తెరపైకి వచ్చిన రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్విని కూడా అదే వాదనను వినిపించింది. జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో శిరీష ఆత్మహత్య తనకు చాలా బాధ కలిగించిందని ఆమె తెలిపారు. ఇంత చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని చెప్పారు.

రాజీవ్ ను తాను ప్రేమించానని, అయితే రాజీవ్ తనను పూర్తిగా మోసం చేశాడని తెలిపారు. రాజీవ్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రాజీవ్ తో ఫ్రేస్ బుక్ లో ప్రెండ్ షిఫ్ చేసిన తరువాత క్రమంగా నన్నిహతంగా మారేందుకు కూడా కారణమైందని తెలిపారు. రాజీవ్ కోసమే బెంగుళూరులోని తన ఉద్యోగాన్ని హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నానని చెప్పారు. రాజీవ్ ప్రవర్తన అనుమానాస్పందగా వుండటంతో.. వారి తల్లిదండ్రులను కూడా కలిసి తన కోరికను విన్నవించానని చెప్పారు. అయితే వారు కూడా అందుకు అంగీకరించలేదని తెలిపారు.

శిరీష రాజీవ్ తో చాలా చనువుగా ఉండటం చూసి ఓర్వలేకపోయానని, తాను పెళ్లి చేసుకోవాలని భావించిన వ్యక్తితో పరాయి స్త్రీని చనువుగా వుంటే ఎవరు మాత్రం ఊరికే వుంటారని ప్రశ్నించారు. దీందో తాను చాలాసార్లు శిరీషతో గొడవపడ్డానని తెలిపారు. ఈ విషయమై శిరీష, తాను పోలీసు స్టేషన్ వరకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసుకున్నామని చెప్పారు. శిరీష వల్లే రాజీవ్‌ తనను దూరం పెడుతున్నాడన్న అనుమానం కలిగిందని తెలిపారు. రాజీవ్‌కు తెలియకుండా శిరీషతో ఫోన్‌లో చాలాసార్లు గొడవపడ్డానని వెల్లడించారు. కాగా తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కూడా చాలాసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తేజస్వినీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shirisha  Tejaswini  software engineer  beautician  RJ photography  rajeev kumar  sravan  crime  

Other Articles