Telangana Girl in Borewell Parents loss Hopes

Child in borewell rescue works still continue

Chevella Child, Chevella Borewell, Chevella Child in Borewell, Resuce Operations, Meena Parents, Meena Borewell, Baby Meena Death, Borewell Girl Died, Telangana Baby Borewell, Baby Meena Parents, Telangana GOvt Borewell Deaths, Borewell Mishap, Telangana Borewell Deaths

Chevella Child Meena in Borewell. Resuce Operations Continue. ONGC officials to join. Baby slip into 230 feet borewell.

నరకయాతనకు ఎలాంటి ముగింపో?

Posted: 06/24/2017 09:04 AM IST
Child in borewell rescue works still continue

గుండెలు పగిలేలా రోదించిన ఆ తల్లి ఆశలు గంటలు గడుస్తున్న కొద్ది సన్నగిల్లుతున్నాయి. 40 గంటలు గడుస్తున్నా పాపను బయటికి తీయకపోవటంతో ఆందోళన ఎక్కువ అయిపోతుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెం చెన్వెల్లి వద్ద బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనా ఉదంతం తెలిసిందే.

గురువారం సాయంత్రం ఆడుకుంటూ బోర్ బావిలో పడిపోయిన పాప కోసం అంతా ప్రార్థనలు చేస్తున్నారు. తొలుత 40 అడుగుల అగాధంలోకి జారిపోయిందని గుర్తించి నిపుణులు మోటర్ తో సహా వెలికి తీసే ప్రయత్నంలో మరింత లోతుకు జారిపోయింది. 80 అడుగులు అని అధికారులు చెబుతున్నప్పటికీ అందులో స్పష్టత లేదు. రాతినేల కావటంతో యాజమాని రాంరెడ్డి దాదాపు 300 అడుగుల లోతు వరకు బోర్ వేయించినట్లు చెప్పకుంటున్నారు. మరోపక్క 230 అడుగుల లోతుకు జారిపోయినట్టు సమాచారం అందుతోంది.

పాపను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు, ఎల్ అండ్ టీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. నిపుణులు చేపట్టిన చర్యలంతా విఫలం కావడంతో, బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉదయం సీసీ కెమెరాలతో పాపచేతి కదలికలు గమనిస్తూ సహాయకచర్యల్లో వేగం పెంచినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవటం, నిదానంగా సాగుతున్న చర్యలు ఇబ్బందికరకంగా మారాయి. ఈనేపథ్యంలో సీఎం ముఖ్యమంత్రి స్వయంగా అధికారులకు సూచనలు చేయటంతో ఓఎన్ జీసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగి చర్యల్లో వేగం పెంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chevella  Borewell Mishap  Baby Meena  

Other Articles