Nitish Kumar Not Support to Meira Kumar

Nitish kumar on meira kumar nomination on presidential polls

Nitish Kumar, Nitish Kumar Lalu Prasad Yadav, Lalu On Presidential Polls, Nitish Kumar On Presidential Polls, Meira Kumar Lalu Prasad Yadav, Lalu Prasad Yadav Nitish Kumar Clash, Nitish Kumar Bihar Ki Beti

Bihar Chief Minister on Meira Kumar Presidential Candidate nomination, Says He supported only Ramnath Kovind, 'Bihar Ki Beti' Meira Kumar Has Been Nominated Only To Lose.

మీరా... ఓడిపోయేందుకే పోటీనా?

Posted: 06/24/2017 08:36 AM IST
Nitish kumar on meira kumar nomination on presidential polls

రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మీరాకుమార్ కు మద్ధతు కరువవుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మనసు మార్చాలని యత్నించిన లాలూ ప్రయత్నం వేస్ట్
అయిపోయింది. తన ఫుల్ సపోర్ట్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాతే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన మీరాకుమార్ అంటే తనకు చాలా గౌరవమని, అయితే, రాష్ట్రపతి రేసులో ఓటమి తప్పదని తెలిసే ఆమె ముందుకు వచ్చారని అన్నారు. ఆమెను రెండు సార్లు ఆ గౌరవ ప్రధానమైన పదవికి నామినేట్ చేసే అవకాశం ఉన్నా యూపీఏ ఆ పని చేయకుండా ఇప్పుడు ఆమె ఓటమి తెలిసి కూడా బరిలో దింపుతుందని ఆయన వ్యాఖ్యానించాడు.

ఇంతకుముందు కూడా తాము ఇలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నామని, ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని నితీశ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, మిత్రపక్షాల మాట కాదని రామ్ నాథ్ కోవింద్ కు మద్ధతు ప్రకటించి నితీశ్ చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నాడని లాలూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Ki Beti  Meira Kumar  Presidential Elections  Nitish Kumar  

Other Articles