Assembly Passes Resolution to Limit Powers of LG గవర్నర్ పై అధికార పక్షం గరం.. గరం.. అసెంబ్లీ తీర్మాణం

Assembly passes resolution to limit powers of lg kiran bedi

ADMK MLA Anbazgahan, kiran bedi, Puducherry assembly, Puducherry Chief Minister V Narayanasamy, Puducherry government, Puducherry Lt Governor Kiran Bedi, resolution against Kiran Bedi, V Narayanasamy, politics

The elected Congress government has alleged that Bedi interferes in the political functioning of the UT, disrupting daily functioning.

గవర్నర్ పై అధికార పక్షం గరం.. గరం.. అసెంబ్లీ తీర్మాణం

Posted: 06/17/2017 12:23 PM IST
Assembly passes resolution to limit powers of lg kiran bedi

ప్రభుత్వ అధికార కార్యకలాపాల్లో నిత్యం అడ్డువస్తున్నారని అధికార పక్షానికి చెందిన ప్రభుత్వం ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలలో కొత విధించాలని కొరుతూ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని పుదుచ్చేరి అసెంబ్లీ అమోదించింది. కేంద్ర పాలిత ప్రాంతాలలో లెఫ్టినెంట్ గవర్నర్లకు పూర్తి అధికారులు ఇవ్వడంతో.. వారిని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తమ పాలనను సాగిస్తుందని అధికార పక్షం ఇప్వపటికే అరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ బేడీపై గుర్రుగా ఉన్న వి.నారాయణస్వామి ప్రభుత్వం ఆమెకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమోదించారు.

కిరణ్‌బేడీ విశేష అధికారాలను తగ్గించేందుకే ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఏఐఎన్ఆర్‌సీ ఈ తీర్మానాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండగా అడ్డుకున్నందుకు గాను ఏఐఎన్ఆర్సీకి చెందిన ఇద్దరు  సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో అసెంబ్లీలో కొంత సేపు తీవ్ర గంధరగోళం నెలకొంది. అయితే ఏఐఎన్ఆర్సీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకురావడంతో అసెంబ్లీ తీర్మాణాన్ని అమోదించింది.

కిరణ్‌బేడీ తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం, రాజ్‌భవన్‌లో అధికారులతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండడం, సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపిస్తుండడంతో నారాయణస్వామి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గత కొంతకాలంగా గవర్నర్, నారాయణస్వామి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ విశేష అధికారాలను అణచివేయాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఇక నుంచి కిరణ్‌బేడీ ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోజాలరని, ఏదైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వ విషయాల్లో కిరణ్‌బేడీ అనవసరంగా తలదూరుస్తున్నారని అధికార కాంగ్రెస్ సభ్యుడు ఆర్‌కేఆర్ ఆనందరామన్ ఆరోపించారు. ‘‘అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. హిట్లర్  ప్రవర్తన కంటే బేడీ ప్రవర్తన దారుణంగా ఉంటోందని ఆయన ఆరోపించారు. కాగా, తనకు వ్యతిరేకంగా పాస్ చేసిన రిజల్యూషన్‌పై బేడీ ఇప్పటి వరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  V Narayanasamy  LG  Puducherry chief minister  Puducherry  

Other Articles