SBI's New Charges On ATM, Other Transactions ఎస్బీఐ ఖాతాదారులపై నేటి నుంచి బాదుడు షురూ..!

Sbi s new charges on atm other transactions from today

SBI new charges, State Bank of India charges, sbi ATM charges, charges per transactions, new charges of sbi, sbi charges per transaction, sbi mobile wallet, Banking Sector India, demonetisation, bank buddy, additional charges

The country’s largest lender State Bank of India has revised service charges on ATM withdrawal for users of its mobile app “SBI Bank Buddy,” and various other cash transactions, effective June 1.

ఎస్బీఐ ఖాతాదారులపై నేటి నుంచి బాదుడు షురూ..!

Posted: 06/01/2017 10:13 AM IST
Sbi s new charges on atm other transactions from today

దేశంలోని ఇకపై డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అటు రిజర్వు బ్యాంకుతో పాటు ఇటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ.. వారికి పెద్ద ఎత్తున బహుమతులను కూడా ప్రకటిస్తుండగా, అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం అందుకు పూర్తి భిప్నంగా వ్యవహరిస్తూ.. నేటి నుంచి కొత్త చార్జీలను అమలు పరుస్తుంది. డిజిటల్ సహా నగదు లావాదేవీలు జరిపే కస్టమర్ల జేబులకు అదనపు చార్జీల పేరుతో చిల్లులు పెడుతుంది.

అయితే ఈ కొత్త చార్జీలను ఇప్పటికే ప్రకటించిన ఎస్బీఐ.. వాటిని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.  మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బుడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, మొబైల్ వాలెట్ ను వాడి ఏటీఎం నుంచి డబ్బును తీసుకుంటే, ఒక్కో లావాదేవీకి రూ. 25 రూపాయలను వసూలు చేస్తారు. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలకు అనుమతి వుంటుంది.

కొత్త వడ్డింపుల్లో భాగంగా, అత్యవసర చెల్లింపు సేవలను వాడుకునే కస్టమర్లపై బ్యాంకు చార్జీలతో పాటు సేవా పన్నను కూడా వడ్డించనున్నారు. ఈ సర్వీసులను వినియోగించుకునే కస్టమర్లు లక్ష రూపాయల వరకూ బదిలీ చేస్తే 5 రూపాయలు చార్జీ.. దీనికి అదనంగా సేవా పన్ను, రూ. 2 లక్షల వరకూ లావాదేవీపై 15 రూపాయలు చార్జీతో పాటు సేవా పన్ను.. 5 లక్షల రూపాయల వరకూ డబ్బును బదిలీ చేస్తే 25 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్ ను బ్యాంకు వసూలు చేస్తుంది.

ఇక మరో తాజా నిర్ణయం కూడా ఎస్బీఐ తీసుకుంది. ఇకపై పాడైపోయిన నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకోవాలంటే కూడా చేతి చమురు వదలాల్సిందే. పాత నోట్లు మార్చుకునే వాటి విలువ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రెండు రూపాయలతో పాటు సేవా పన్నును కూడా వసూలు చేస్తుంది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సేవా పన్నును చెల్లించాల్సిందే. ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగివున్న వారు ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 20కి బదులు ఏకంగా రెండున్నర రెట్టు చార్జీని పెంచి రూ. 50 చెల్లించుకోవాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles