jr ntr pays homage at ntr ghat ఎన్టీయార్ కు చంద్రబాబు, హరికృష్ణ, తారక్ నివాళులు

Chandrababu jr ntr harikrishna pays tribute to ntr

fans pay tributes to NTR, party cadre pay tribute to NTR, chandrababu pays pay tribute to NTR, Hari Krishna pay tribute to NTR, NTR family members pay tribute to ntr, Tarak pay tribute to NTR, chandrababu, Maha nadu, nandamuri family, ntr birth anniversary, nandamuri harikrishna, Junior NTR, tarak

Former MP Hari krishna, Jr.NTR and family members visited NTR Ghat and paid floral tributes to Former CM NTR on the eve of his birth anniversary. While CM chandrababu paid tributes at vizag in Mahanadu.

రామన్నకు అభిమానులు, టీడీపీ, కుటుంబసభ్యుల ఘననివాళులు

Posted: 05/28/2017 09:34 AM IST
Chandrababu jr ntr harikrishna pays tribute to ntr

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, అంధ్రుల అభిమాన నటుడు, పేదోడి అన్న సర్గీయ నందమూరి ఎన్టీఆర్‌ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ జయంతి తెలుగు ప్రజలకు పర్వదినమని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతకు, సోదరబావానికి తీసుకున్న చర్యలను గుర్తుచేసుకున్నారు. ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. తెలుగువారంతా ఒకటే కులమని.. మానవ కులమని పేర్కొన్నారు.

హైదరాబాదు, నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా అభిమానులు ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. వచ్చి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, తెలుగు ప్రజలకు ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని వ్యాఖ్యానించాడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారని, ఆ స్థానం మరెవ్వరికీ దక్కదని అన్నాడు. ఎన్ని తరాలు గడిచినా  ఎన్టీఆర్‌ ఖ్యాతిని తెలుగు జాతి మర్చిపోదని హీరో కళ్యాణ్‌ రామ్‌ పేర్కొన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. వీరితో పాటు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన స్మారక చిహ్నం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు వస్తుండటంతో ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles