CM KCR slams bjp national president amit shah మేము హౌలాగాళలా కనిపిస్తున్నామా..? అమిత్ షా: కేసీఆర్

Cm kcr slams bjp national president amit shah

cm kcr on amit shah, kcr challenges amit shah, kcr slams amit shah, kcr black money, kcr submerfing 7 mandals, amit shah, chandrashekhar rao, kcr, telangana, telangana news, narendra modi, bjp national president, news, hyderabad news

Telangana chief minister K chandra shekar Rao slams BJP National President Amit Shah and condemns his statements as false.

మేము హౌలాగాళలా కనిపిస్తున్నామా..? అమిత్ షా: కేసీఆర్

Posted: 05/24/2017 05:50 PM IST
Cm kcr slams bjp national president amit shah

తెలంగాణ‌లో ప‌ర్యటిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. అమిత్ షాకు ధైర్యం వుంటే తాను చెప్పిన విషయాల్లో ఏదైన తప్పులున్నాయని నిరూపించాలి లేదా.. రాష్ట్రం వదలిపోకముందే అమిత్ షా తెలంగాణ ప్రజలకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ వినేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. హైదరాబాద్ లోనే హైకోర్టు వుంది ఇప్పుడు దాని విషయంలో విభజన ఎందుకు అని ఢిల్లీ నుంచి అమిత్ షా వచ్చి చెప్పాలా..? అది మాకు తెలియదా..? ఏపీ రాజధాని హైదరాబాద్ కూడా తెలంగాణలోనే వుందని, ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అప్పట్లో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన అద్వానీ కూడా అన్నారు. న్యాయవిభజన జరగనంతవరకూ రాష్ట్ర విభజన జరిగినట్టు కాదు.. ఏది పడితే అది మాట్లాడితే వినేవాళ్లు తెలంగాణలో లేరని.. బీజేపి జాతీయ నేతలు మమల్ని హౌలాగాళ్లం అనుకుంటున్నారా..? అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రతి ఏటా తెలంగాణ‌కు అద‌నంగా 20 వేల కోట్ల రూపాయ‌లు ఇస్తున్నట్లు అమిత్ షా ప‌లు వ్యాఖ్యలు చేశారని సీఎం అన్నారు. అమిత్ షాకి తాను ఓపెన్ చాలెంజ్ చేస్తున్నానని అన్నారు. అద‌నంగా 200 కోట్ల రూపాయ‌లైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రానికి ప‌న్నుల కింద‌ తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయ‌లు చెల్లించుకుంద‌ని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కు తెలంగాణ‌కు కేంద్ర ప్రభుత్వం 63,790 మాత్రమే ఇచ్చింద‌ని వివ‌రించారు. కేంద్ర ప‌న్నుల్లో వాటాల కింద ఈ మూడు ఏళ్లలో రాష్ట్రానికి 37,773 కోట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాలకు తెలంగాణ‌కు రూ.18,574 కోట్లు వ‌చ్చాయ‌ని కేసీఆర్ అన్నారు. జాతీయ ర‌హదారుల కింద ఇప్పటివ‌ర‌కు రాష్ట్రానికి 2,055 కోట్లు మంజూరు అయ్యాయని, ఇవ్వి కేంద్రమే ఖ‌ర్చు పెడుతుంద‌ని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టం కింద రూ.1,016 కోట్లు మాత్రమే రెండు వాయిదాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింద‌ని, ఏపీకి మాత్రం ఇప్పటికి మూడుసార్లు ఇచ్చింద‌ని తెలిపారు. ఫైనాన్స్ క‌మిష‌న్ ఫండ్స్ 5,160 కోట్లు వ‌చ్చాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ‌కు రూ.1,200 కోట్ల పై సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.

దేశంలోనే తెలంగాణ అత్యంత సంపన్న రాష్ట్రమని.. ఏదో కేంద్రం ఇచ్చే నిధులపై అధారపడి బతికే రాష్ట్రంలా మమల్ని పరిగణిస్తున్నారు..? మేమే కేంద్రానికి నిధులను సమకూర్చుతున్నామని కేసీఆర్ అన్నారు. అమెజాన్‌, గూగుల్ లాంటి ఎన్నో సంస్థలు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని, కొన్ని కోట్ల విదేశీ మారకాన్ని సంపాదించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నామ‌ని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిందేన‌ని, ఆ ప్రకార‌మే బీజేపీ ప్రభుత్వం ఇస్తుంద‌ని, అంతేగానీ అద‌నంగా ఏమీ ఇవ్వలేద‌ని అన్నారు. ఎన్నికలప్పడు బ్లాక్ మనీ తీసుకువస్తామని చెప్పారు. కానీ ఇప్పుడ అడిగితే ఎన్నికల జిమ్మిక్కు అని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ఏదడిగినా ఇస్తామని అంటారు.. కానీ ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేసీఆర్ దుయ్యబట్టారు.

అమిత్ షా రాజ‌కీయ ప్రేరేపిత‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కేసీఆర్ అన్నారు. లెక్కలు ఒకలా ఉంటే అమిత్ షా మరోలా ప్రచారం చేస్తున్నారని, తప్పులు ప్రచారం చేయ‌డమేంట‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. కేంద్ర పథకాలు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో చేరడం లేదని అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వ తీరు బాగోలేదని అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫించన్లు ఇచ్చే గతే లేదని అమిత్ షా అన్నారని, అలా అనడంతో అసలు అర్థమేలేదని కేసీఆర్ అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  chandrashekhar rao  kcr  narendra modi  pm modi  telangana  

Other Articles