Max Hill Prediction on Manchester Terror Attack

Britain neglected max hill warning

Britain Terror Watchdog, Max Hill, Lawyer Max Hill, Terror Chief Max Hill, Manchester Attack, Terror Threat UK, Manchester Attack Before Warn, Max Hill Prediction, Max Hill Manchester Suicide bomb Attack, Manchester Blast mac Hill, ISIS Manchester Attack, Manchester Attack Indian Woman Doctor, Indian Escaped ISIS Attack

Manchester Suicide Bomb Attack. Terror Chief Max Hill just before days 'Terror Threat in UK is high'.Indian Woman Doctor escaped from Manchester Blast.

ఆ లాయర్ మాటలు లైట్ తీసుకోకుంటేనా...

Posted: 05/24/2017 08:48 AM IST
Britain neglected max hill warning

మరోసారి ఉగ్రదాడితో ప్రపంచం వెన్నులో వణుకుపుట్టించింది ఐఎస్ఐఎస్. పూర్తి భద్రత చర్యల నడుమ జరిగిన ఓ పాప్ సింగర్ షో లో ఆత్మాహుతి దాడి జరిపి 22 మందిని బలి తీసుకోవటంతో తన ఉనికిని చాటింది. అయితే మాంచెస్టర్ దాడి గురించి ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించారని అంటున్నాడు మాక్స్‌ హిల్‌ అనే బ్రిటన్ న్యాయవాది. టెర్రరిస్ట్ చీఫ్ గా పేరొందిన మాక్స్ హిల్ ఉగ్రవాదులపై పరిశోధనలు చేస్తుంటారు. టెర్రరిజం, బ్రిటిష్ చట్టాలపై ఆయన అధ్యయనం చేశారు కూడా.  మృత్యు సంగీతం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై చాలా పరిశోధన చేసిన అనుభవం ఉంది. అందుకే ఫిబ్రవరి లోనే ఆయన బ్రిటన్ ను ఉగ్రదాడులపై హెచ్చరించాడు కూడా. రెండు నెలల కిందట ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ బాగ్దాదీ వీడ్కోలు ప్రసంగం చేస్తూ... ఐఎస్ఐఎస్ ఓటమి పాలైందని, మిగిలిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులంతా ఆత్మహత్య చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అదంతా డ్రామా అంటూ హిల్ కొట్టిపారేశాడు. సిరియా, ఇరాక్ లలో చావుదెబ్బతిన్న ఐసిస్ తన వ్యూహం మార్చుకుందని, ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే బాగ్దాదీ ముగింపు ప్రకటన చేశాడని చెప్పాడు కూడా.

అయితే ఆయన ప్రకటనను ఎవరూ నమ్మలేదు. ఇరాక్, సిరియాలలో దెబ్బతిన్నప్పుడే వ్యూహం మార్చిన బాగ్దాదీ బ్రిటన్ ను టార్గెట్ చేశాడని కూడా ఆయన హెచ్చరించాడు. కానీ, ప్రభుత్వాలు ఆయన మాటలను పెడచెవిన పెట్టాయి. ఫలితమే మాంచెస్టర్ ఎరీనాపై ఉగ్రపంజా. ఇప్పటికైనా నిఘా వర్గాలు త్వరపడాలని, వెస్ట్ లండన్ కంటే భయంకరమైన పేలుళ్లు త్వరలో జరిగే అవకాశం ఉందని మరోసారి వార్నింగ్ బెల్ మోగిస్తున్నాడు.


ప్రాణాలు దక్కాయి: భారతీయ వైద్యురాలు

మాంచెస్టర్ పేలుళ్ల నుంచి భారతీయ వైద్యురాలు, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరగడానికి సరిగ్గా ఏడు నిమిషాల ముందు వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌లో మాంచెస్టర్ ఎరీనా వద్ద ఉగ్రదాడి జరగడానికి ముందు జైపూర్‌కు చెందిన వైద్యురాలు సోనాల్ పాఠక్ (41), ఆమె 13 ఏళ్ల కుమార్తె శ్రేయ, ఆమె స్నేహితురాలు ఆన్య అక్కడే ఉన్నారు. చివరి సాంగ్ ముగింపు దశలో ఉండగా వారు బయటికి వచ్చేశారు. సరిగ్గా కొద్ది సేపటికి పేలుడు శబ్దం, హహాకారాలు మిన్నంటాయని ఆమె చెప్పింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchester Attack  Terror Threat  

Other Articles