Chandrababu warn Andhra leaders to don't Criticize BJP Ally

Tdp bjp alliance ready to break

TDP-BJP Ally, TDP BJP 2019 Elections, 2019 Elections AP, BJP TDP Break, Chandrababu warn Kesineni, Kesineni BJP Ally Comments, Kesineni Nani BJP, Chandrababu Kesineni, Chandrababu Fears Amit shah, Jagan TDP BJP Ally

After Kesineni Nani Comments on BJP, TDP Chief N Chandrababu Naidu warns Andhrapradesh TDP Don't criticise ally , But, BJP doubtful on 2019 election.

చంద్రబాబు వార్నింగ్.. బీజేపీ మాత్రం డౌటే...

Posted: 05/23/2017 10:36 AM IST
Tdp bjp alliance ready to break

జగన్ మోదీ కలవటంపై తీవ్ర విమర్శలు చేసిన కొందరు టీడీపీ నేతలు తర్వాత మిత్రపక్షం బీజేపీని టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాళ్లమని విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. 2019 బీజేపీ-టీడీపీ పొత్తుపై ఆయన వ్యాఖ్యలు పెను ప్రభావం చూపుతాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.

జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశంలో పార్టీ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించాడని చెబుతున్నారు. గీత దాటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని, తాను సమస్యలు పరిష్కరిస్తూ వస్తుంటే, కొందరు కొత్త సమస్యలు కొనితెస్తున్నారంటూ పరోక్షంగా కేశినేనిపై మండిపడ్డట్లు సమాచారం. నేతలు పరిధులు దాటి మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోనని పార్టీ నేతలకు నేరుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు టీటీడీపీ నేతలకు కూడా ఇదే సూచన చేసిన విషయం తెలిసిందే.

ఇక కేశినేని మాటలపై బీజేపీ గుర్రుగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగుతుందో, లేదో చెప్పలేమంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ నేతలు ఏం మాట్లాడినా చంద్రబాబు అడ్డుకట్ట వేయడం లేదని, తాము గట్టిగా స్పందిస్తే మాత్రం ఆ తరువాత బీజేపీ నేతల గురించి మాట్లాడవద్దని చెప్పి వదిలేస్తున్నారని ఆరోపించాడు. ప్రస్తుతం పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని, అమిత్ షా పర్యటన తర్వాత మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పాడు. మిత్ర ధర్మాన్ని టీడీపీ విస్మరించిందన్న వీర్రాజు, 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఎవరమూ చెప్పలేమని వ్యాఖ్యానించటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  TDP-BJP  Kesineni Nani  2019 Elections  

Other Articles