Shatrughan Sinha, Sushil Modi Twitter War Gets Uglier

Shatrughan sinha sushil modi locked in twitter war

BJP Shatrughan Sinha, Shatrughan Sinha Sushil Kumar Modi, Shatrughan Sinha Twitter, Shatrughan Sinha Versus BJP, Shatrughan Sinha Sushil Modi, Sushil Modi Twitter, Sushil Modi Shatrughan Sinha, Shatrughan Sinha Lalu Kejriwal, Shatrughan Sinha Anti BJP Tweets

BJPs Shatrughan Sinha hails Lalu-Kejriwal, Sushil Modi asks for his removal. Shatrughan Sinha Solid Counter to Modi.

గన్ షాట్ తో పెట్టుకుంటే మటాషే!

Posted: 05/23/2017 10:02 AM IST
Shatrughan sinha sushil modi locked in twitter war

ప్రతిపక్షాలనే కాదు.. సొంత పార్టీని కూడా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయటం ఒక్క శతృఘ్న సిన్హాకే సాధ్యం. అందుకే అభిమానులు ఆయన్ని ముద్దుగా గన్ షాట్ అని పిలుచుకుంటారు. కానీ, కొద్ది రోజులుగా ఆయన వ్యవహారశైలిపై పార్టీ చాలా గుర్రుగా ఉంది. అందుకు కారణం లాలూ, కేజ్రీవాల్ ను పొగుడుతూ ఈ సీనియర్ నటుడు చేస్తున్న ట్వీట్లే కారణం.

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈ ఇద్దరినీ కేంద్రం టార్గెట్ చేసి ఇరకాటంలో పెట్టిందనే టాక్ ఉంది. అయితే నేతలుగా క్రేజ్ ఉన్న వారిపట్ల ఇలాంటి వైఖరి సరికాదన్నది శతృఘ్న సిన్హా వాదన. అందుకే నేరుగా ట్వీట్లతో బీజేపీపై విరుచుకుపడ్డాడు. ఇది సాధారణంగానే అధిష్ఠానంకు కోపం తెప్పించింది. ఈ లోపే బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ బీజేపీకి శత్రువు(శతృఘ్న సిన్హా ను ఉద్ధేశించి) ఎక్కడో లేడని, తక్షణమే దాన్ని సాగనంపాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. మరి గన్ షాట్ దీనికి రిప్లై ఇవ్వకుండా ఉంటుందా?

బీహార్ లో పార్టీని గెలిపించటం చాత కాని కొందరు తనపై విమర్శలు చేయటం కామెడీ గా ఉందని, తాను బీజేపీ వ్యతిరేకినంటూ చేస్తున్న కామెంట్లను ఆధారాలతో నిరూపించాలని లేకపోతే ప్యాకప్ చేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్లాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అంతేకాదు కేజ్రీవాల్ ను సోసైటీ కోసం పాటుపడే వ్యక్తి అంటూ మరో పొగడ్త ట్వీట్ తో బీజేపీ పెద్ద షాకే ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shatrughan Sinha  Sushil Kumar Modi  

Other Articles