Mob Killed 7 People with Fake WhatsApp Message in Jarkhand

Whatsapp rumours led to killed 7 people

Rumours on Social Media, Singhbhum District, Singhbhum Whatsapp Rumour, Fake WhatsApp Message, Jarkhand WhatsApp Message, WhatsApp Message Kill 7 People, Child-Lifters Fake Message, Whatsapp Kidd nappers Message, Jharkhand Whatsapp Fake Message, Jharkhand Violence, Jharkhand Whatsapp Messages, Jharkhand Chaos, Fake WhatsApp Message Kills

Fake WhatsApp messages lead to killing of 7 alleged 'kidnappers' in Jharkhand. At least 19 people have been arrested three days after seven people were beaten to death by a violent mob in two separate incidents in Jharkhand's Singhbhum district over suspicion of being child-lifters, police said.

వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని చంపేశారు

Posted: 05/22/2017 04:10 PM IST
Whatsapp rumours led to killed 7 people

సోషల్ మీడియాలో రూమర్లు ఎంతటి విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయంటే మనుషుల ప్రాణాలు పోవటానికి కూడా కారణమవుతున్నాయి. మాములు మీడియా కంటే జెట్ స్పీడ్ గా నిజనిర్థారణ చేసుకోకుండా గ్రూపుల మధ్య తగాదాలు చోటు చేసుకుండటం మొన్న భైంసాలో జరిగిన ఘటనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. తాజాగా జార్ఖండ్ లో రేగిన ఓ పుకారుతో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

సింగ్ భూమ్ జిల్లాలో కొందరు వ్యక్తులు పిల్లలను ఎత్తుకుపోతున్నారని, వారి శరీర భాగాలను అమ్మేస్తున్నారని మూడు రోజులుగా వాట్సాప్ లో వదంతులు వ్యాపించాయి. దీంతో గ్రామంలో కదలికలు అనుమానంగా కనిపించిన వ్యక్తులను పట్టుకుని చావబాదారు గ్రామస్థలు. నాగధి గ్రామంలో వికాస్, గణేష్, గౌతమ్ అనే ముగ్గురిని, షోబాపూర్, సోసో మౌలీ గ్రామాల్లో నలుగురిని కొట్టి చంపారు. చనిపోయిన వారిలో ఇద్దరు వృద్ధురాళ్లు కూడా ఉన్నారు.

ఇక కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఇలాంటి దారుణ ఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. ప్రశాంతంగా ఉండే గిరిజన గూడేంలో కూడా వాట్సాప్ ఫేక్ మెసేజ్ పెట్టిన చిచ్చుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand  WhatsApp  Fake Message  

Other Articles