Nayini Sensational Comments on Pawan Kalyan

Nayini narsimha reddy over dharna chowk issue

Nayini Narsimha Reddy, Telangana Home Minister, Nayini Narsimha Reddy Pawan Kalyan, Pawan kalyan Janasena, Janasena Kodandaram, Kodandaram Pawan Kalyan, Pawan kalyan Telangana JAC, Pawan Kalyan Dharna Chowk, Pawan Kalyan Nayini Narasimha Reddy, T Minister Pawan Kalyan, Pawan Kalyan Janasena Dharna Chowk, Pawan Communistm Pawan Left Parties, Nayini Pawan, Janasena Nayini, Nayini Sensational Comments, Dharna Chowk Chaos

Telangana Home Minister Nayini Narsimha Reddy Sensational Comments on Oppositions over Dharna Chowk Issue. Slams Left Parties, Kodandaram and Pawan Kalyan.

పవన్, కమ్యూనిస్ట్ లను కలిపి ఏస్కున్నాడు

Posted: 05/16/2017 08:12 AM IST
Nayini narsimha reddy over dharna chowk issue

ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం తరపు నుంచే అభ్యంతరం ఉంది తప్ప.. స్థానికుల నుంచి కాదన్నది వామపక్షాల వాదన. ఈ క్రమంలో సోమవారం జరిగిన రగడతో విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం స్పందించకుండా ఇలా రౌడీలతో రెచ్చగొట్టి కొట్టిస్తుందని కోదండరాం సహా పలువురు నేతలు చెప్పటం చూశాం. స్థానికులేమో జనసేన కార్యకర్తలను పరోక్షంగా ఉద్దేశించి బయటి నుంచి మనుషులను తెప్పించి దాడి చేయించారని ఆరోపించారు.  దద్దరిల్లిన ధర్నా చౌక్

దీంతో ప్రభుత్వం తరపున తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా లెఫ్ట్ పార్టీలు, జేఏసీ చైర్మన్ కోదండరాంతోపాటు జనసేన అధినేత పవన్ పై కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. కమ్యూనిస్టుల్లారా... అతిగా రెచ్చిపోవద్దు, రెచ్చిపోతే చచ్చిపోతారు అంటూ కామెంట్ చేశాడు. తెలంగాణలో కమ్యూనిస్టులకు స్థానం లేదన్న నాయిని, కేసీఆర్ పాలనలో ఏ సమస్య దొరకకపోవటంతో ఇలా ధర్నాచౌక్ వంటి చిన్న సమస్యను పెద్దదిగా చేసి రెచ్చిపోతున్నారని, అది మంచిది కాదని హితవు పలికాడు.

ఇప్పటికే తెలంగాణలో వామపక్షాలకు స్థానం లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ తోక పట్టుకుంటే బతుకుదెరువు ఉండడం లేదని ఎద్దేవా చేశాడు. రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే ప్రజల చేతిలో చచ్చిపోతారని హెచ్చరించాడు. ఇక టీజేఏసీ చైర్మన్ కోదండరాంపైనా నిప్పులు చెరిగిన ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిపక్షాల అండ చూసుకుని కోదండరాం చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు ఆయనకు తోడుగా జనసేనోడు ఒచ్చి చేరిండు. వీడు యాడికెళ్లి ఒచ్చిండో తెల్వదు’’ అంటూ పరుష పదజాలమే వాడాడు. సీనియర్ పొలిటిషియన్, పైగా ఓ కార్మిక నేతగా అనుభవం ఉన్న నాయిని ఇలా వ్యాఖ్యలు చేయటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayini Narasimha Reddy  Telangana  Pawan Kalyan  Dharna Chowk  

Other Articles