Dharna Chowk Row, Protests Turn Violent

Dharna chowk row clash between parties

Dharna Chowk, Indira Park Dharna Chowk, Dharna Chowk Clash, Dharna Chowk Protest Video, Left Parties Versus Locals, Dharna Chowk Chaos, Dharna Chowk Janasena, Dharna Chowk Issue, Dharna Chowk Walkers, Dharna Chowk CPI CPM, Left Parties Locals, Left Parties TRS Dharna Cjowk

Dharna Chowk Row at Indira Park Hyderabad. Clash Between Left Parties and Locals.

ITEMVIDEOS:ధర్నా చౌక్.. దద్దరిల్లిందిగా...

Posted: 05/15/2017 11:27 AM IST
Dharna chowk row clash between parties

గాల్లోంచి అమాంతం ఎగిరిపడ్డ రాళ్లు.. పగిలిన తలలు.. ఇది ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద సోమవారం కనిపించిన పరిస్థితి. ధర్నా చౌక్ ను పార్క్ వద్దే కొనసాగించాలని సీపీఐ, సీపీఎం నిరసనకారులు, వెంటనే తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోటాపోటీ ఆందోళనతో రణరంగంగా మారింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పి ఒకరిపై ఒకరు కొట్టుకునేదాకా వెళ్లింది.

తొలుత శాంతియుతంగా ఇరు వర్గాలకూ తమ నిరసనను తెలుపుకునేందుకు పోలీసులు అనుమతించగా, ఒకే సమయంలో ధర్నా చౌక్ వద్దకు చేరిన ఇరు వర్గాలు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. జండా కర్రలతో తమపై దాడులు చేశారని స్థానికులు, బయటి నుంచి గూండాలను తెప్పించి తమపై రాళ్లను రువ్వారని అఖిలపక్షాలు పరస్పరం ఆరోపించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం, తోపులాటలతో మొదలైన గొడవ, ఆపై రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది.

 

ఎవరినీ అరెస్టులు చేయవద్దని ముందే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగా, అక్కడ మోహరించిన పోలీసులు ఈ దాడులను చూసీ చూడనట్టు వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క ధర్నా చౌక్ ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తూ, కొద్దిసేపటి క్రితం జనసేన కార్యకర్తలు, తమ జెండాలతో ఇందిరా పార్కు వద్దకు చేరుకున్నారు. స్థానికులమని చెప్పుకుంటున్న వారికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు, గూండాలను పంపుతున్నారని వామపక్షాలు ఆరోపిస్తుండగా, అసలు ఈ ప్రాంతంతో ఎంతమాత్రమూ సంబంధం లేని వారు వచ్చి, తమపై గూండాగిరి చేసి దాడి చేశారని స్థానికులు ఆరోపించారు.

ఇక ధర్నా చౌక్ నగరం మధ్యలో ఉంటేనే నిరసనలు తెలిపే సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని తమ నేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకే వచ్చినట్టు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. నిరసనలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా జనసేన కార్యకర్తలు తరలిరావటం విశేషం. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఇరు వర్గాలనూ వేరు చేసి బందోబస్తును పెంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు. అసలు నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటల తరువాతే ఉండటంతో ఎటువంటి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అదనపు బలగాలను మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dharna Chowk Clash  Indira Park  Left Parties  

Other Articles