RBI asks banks to Update ATM Software

Rbi to banks open atms only after software update

ATM Software Update, Indian ATMs Close, ATM Close, RBI WannaCry Malware, Wanna Cry Crisis, RBI ATMs, Indian ATMs Cyber Attack, Indian ATM Close, ATMs Que, ATMs Close, ATM RBI, RBI Software Update, RBI Ask Banks, Cyber Attack RBI

As WannaCry spreads, RBI asks banks not to run ATMs without software update. RBI instructed Banks Open ATMs only after update.

ఏటీఎంలను వెంటనే మూసేయండి: ఆర్బీఐ

Posted: 05/15/2017 12:55 PM IST
Rbi to banks open atms only after software update

నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటంలో భాగంగానే ఈ పిలుపు ఇచ్చిందనుకుంటే పొరపాటే. అలాగని కరెన్సీ కొరత కూడా రీజన్ కాదు. ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న సైబర్ ఎటాక్ సంక్షోభంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. వాన్నా క్రై వైరస్ నేపథ్యంలో విండోస్ అప్‌డేట్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవొద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై సోమవారం రెండోసారి కూడా హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నట్టు వార్తలు రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలో దాదాపు 90 శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం మీదే ఆధారపడుతున్నారు. దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే పనిచేస్తున్నాయి.

కాబట్టి విండోస్ అప్‌డేట్ వెర్షన్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవవద్దని రిజర్వు బ్యాంకు సూచించింది. వాన్నా క్రై ఏటీఎంల నుంచి ప్రజల సొమ్మును దొంగిలించదని, అందులో ఉన్న సమాచారాన్ని లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమే దాని లక్ష్యమని బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే ఖాతాదారుడి అకౌంట్ పై, వ్యక్తిగత డేటాపై దీని ప్రభావం ఉండబోదని ఏటీఎం ఆపరేటర్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  WannaCry  Update ATMs  

Other Articles