ICJ stay on Kulbhushan Jadhav's death sentence పాకిస్తాన్ కు అక్కడ దిమ్మదిరిగి బొమ్మ కనబడింది..

Pakistani media reported icj stay on kulbhushan jadhav s death sentence

Kulbhushan Jadhav, International Court of Justice, ICJ, Who is Kulbhushan Jadhav, pakisttan media

Pakistan International Airlines has taken its senior pilot off-duty for allegedly sleeping on a London-bound flight, risking the lives of over 300 passengers on board by handing over the aircraft to a trainee.

పాకిస్తాన్ కు ఆ కోర్టులో దిమ్మదిరిగి బొమ్మ కనబడినా..

Posted: 05/10/2017 05:10 PM IST
Pakistani media reported icj stay on kulbhushan jadhav s death sentence

'గూఢచారి' ముద్ర వేసి ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై పాకిస్థాన్ కు అంతర్జాతీయ న్యాయస్థానంలో దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. అయితే అక్కడి మీడియా మాత్రం ఈ విషయాన్ని కనీసం ఉన్నది వున్నట్లుగా కూడా చెప్పలేకపోయింది. ఈ విషయంలో పాకిస్థాన్ మీడియా పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోంటుంది. గూఢచర్యానికి పాల్పడ్డాడని పాక్ ఆర్మీ న్యాయస్థానం ఆరోపిస్తూ కుల్ భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం కుల్ భూషణ్ జాదవ్ వై విధించిన స్టేను ప్రచురించని అక్కడి మీడియా.. ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి పాకిస్థాన్ రాదని, దీంతో తమ న్యాయస్థానం విధించిన తీర్పును సవాల్ చేయడంలో కానీ, కనీసం ప్రశ్నించడం, స్టే విధించే వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి అసలు స్టే విధించే అవకాశం కూడా లేదని కుల్ భూషణ్ వ్యవహారాన్ని ప్రచురించిన ఒకటి రెండు మీడియా సంస్థలు కూడా ఇలా విషాన్ని కక్కాయి. ఇక జీయో టీవీ కాని, డాన్ అన్ లైన్ కానీ అసలు ఈ విషయాన్ని రిపోర్టు కూడా చేయలేని దుస్థితిలోకి జారుకున్నాయి.

అయితే కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో న్యాయంకోసం ఎంత దూరమైనా వెళ్తామన్న భారత్ అతనికి పాకిస్థాన్ లోని ఆర్మీ కోర్టు విధించిన తీర్పును సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అశ్రయించింది. కాగా పాకిస్తాన్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా భారత్ పాక్ లోని న్యాయవాదులెవరూ కుల్ భూషన్ జాదవ తరపున వాదించకూడదని నిర్ణయించారని కూడా పేర్కొంది.

వ్యాపారం పనిపై ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లిన కుల్ భూషన్ జాదవ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, పాక్ సైన్యానికి విక్రయించారని, ప్రతిగా ఉగ్రవాదులను విడిపించుకుని, నిధులు పొందారని భారత్ ఆరోపించింది. ఈ మేరకు అవసరమైన సాక్ష్యాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో చూపించడంతో కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో పాక్ షాక్ తింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles