Minister Narayana's Son Nishit Died in Road Accident

Narayana s son killed in road acciddent

Andhra Pradesh, Andhra Pradesh Minister So, Minister SOn Died Road Accident, Narayana Son Died, Narayana's son Nishit, P Nishit Narayana Died, AP Minister Son Death, Narayana Son Death, Metro Pillar Kills Minister Son, Nishit Narayana Death, Narayana Educational Group Chairman Nishit, Nishit Narayana, Minister P Narayana Family, Minister Narayana Debacle, Chandrababu Minister Narayana Son Death, Harish Rao Minister Narayana

Andhra Pradesh Municipal Administration and Urban Development Minister P Narayana's son Nishit Narayana Died. Nishit and his friend killed in road accident Hyderabad.

ఏపీ మంత్రి నారాయణ కొడుకు దుర్మరణం

Posted: 05/10/2017 08:16 AM IST
Narayana s son killed in road acciddent

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ ఇంట విషాదం నెలకొంది. ఆయన తనయుడు, నారాయణ గ్రూప్స్ డైరక్టర్ పి. నిషిత్ నారాయణ(23) హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితుడు కూడా దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది.

మంగళవారం రాత్రి టీఎస్ 07 ఎఫ్ కే 7117 నంబర్ గల బెంజ్ కారులో వీరిద్దరు వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో వాహనం మెట్రో పిల్లర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో నిషిత్, పక్కనే ఉన్న రవివర్మ అక్కడికక్కడే మృతి చెందారు వారిద్దరి మృత దేహాలను అపోలో ఆస్పత్రికి తరలించగా, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఘటన గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశాడు. రవివర్మ వ్యాపారి చినబాబు తనయుడు.

ఇక మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉండగా, బంధువుల ద్వారా విషయం తెలుసుకుని హుటాహుటిన బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇంకో పక్క ఆయన బంధువు, మంత్రి గంటా కూడా వైజాగ్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు. నిషిత్ ఈ మధ్యే ఎడ్యుకేషనల్ గ్రూప్స్ హెడ్ గా బాధ్యతలు స్వీకరించాడు. కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావటంతో అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Minister Narayana  Nishit Narayana Death  Road Accident  

Other Articles