Demonetisation move hit lower income groups more: UN report ఆశించిన ప్రయోజనాలను ఇవ్వని నోట్లరద్దు: ఐక్యరాజ్య సమితి

Demonetisation did not stop future black money flows un report

Black money, Demonetisation, demonetisation impact on agriculture, demonetisation impact on rural income, digitisation, note ban, UN Economic and Social Survey of Asia and the Pacific 2017, RBI, Shaktikanta Das, finance ministry, arun jaitley, pm modi, economy

The Indian government's demonetisation measures did not impede future black money flows in new denominations, a UN report said

ఆశించిన ప్రయోజనాలను ఇవ్వని నోట్లరద్దు: ఐక్యరాజ్య సమితి

Posted: 05/09/2017 03:52 PM IST
Demonetisation did not stop future black money flows un report

దేశంలోని అవినీతి, నల్లధనాన్ని అణచివేతకు, ఉగ్రవాద కార్యకలాపాలకు, అంతర్గత తీవ్రవాద పీచమణిచేందుకు నోట్ల రద్దును చేపడుతున్నామని నవంబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం.. ఆ తదుపరి చర్యలు ఏ మేరకు ప్రతిఫలాలను అందించాయంటే.. పేదలను, మధ్యతరగతివారిని ఇబ్బందులను తెచ్చిపెట్టడం మినహా ఏ మాత్రం ప్రయోజనాలను ఇవ్వలేదని అన్ని విఫక్షాలు ఏకతాటిపైకి రాకుండానే ఐక్యంగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. పాత పెద్ద నోట్లు.. రూ. ఐదు వందలు, వెయి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ ఎనమిదిన తీసుకున్న నిర్ణయం.., ఆరు మాసాల తరువాత కూడా ప్రజలకు ఎలాంటి ప్రతిఫలాలను ఇవ్వలేకపోయిందని, ఏకంగా ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది.

భారత ప్రధాని మోడీ సహా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకులన్నీ ఎంతగా ప్రచారం చేసినా..  అవన్నీ ఒట్టి మాటలనే స్పష్టమైంది. చేసిన కష్టానికి డబ్బులు రావడం లేదని అంగలార్చిన ప్రజలకు నోట్ల కష్టాలంటే ఏమిటో..? అవి ఎంతలా బాధపెడతాయో అర్థమయ్యేలా మాత్రం చేసింది. ప్రధాని సహా కేంద్రమంత్రులు, అర్థిక వ్యవహరాల శాఖ అధికారులు చెప్పినవన్నీ అమలుకు మాత్రం నోచుకోలేదని తేలిపోయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గత అరు నెలలుగా భారత్ లో నల్లధనానికి అడ్డుకట్ట పడలేదని స్పష్టం చేసిన ఐక్యరాజ్య సమితి ఇక భవిష్యత్తులో కూడా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని భావించలేమని అభిప్రాయపడింది.

నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఓ నివేదికను విడుదల చేస్తూ, చలామణిలో ఉన్న 87 శాతం కరెన్సీని రద్దు చేయడం మంచి విషయమే అయినా, దీనివల్ల నల్లధనం ఆగుతుందని భావించలేమని, ఇదే సమయంలో అన్ని రకాలుగా వెల్లడించని ఆస్తులను బయట పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని 'ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2017' పేరిట విడుదల చేసిన రిపోర్టులో యూఎన్ పేర్కొంది. ఇండియా జీడీపీలో 20 నుంచి 25 శాతం విలువైన నల్లధనం ఉండి వుండవచ్చని, ఇందులో 10 శాతం నగదు రూపంలోనే ఉందని భావిస్తున్నామని తెలిపింది. మరిన్ని డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలతో చలామణిలో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేసింది. ఇండియాలో మొత్తం లావాదేవీల్లో 20 శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని, వ్యక్తిగత ఖర్చులో 5 శాతమే నగదు రహితమని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  RBI  Shaktikanta Das  finance ministry  arun jaitley  pm modi  economy  

Other Articles