poor father carries dead body of son in up భుజాలపై కొడుకు మృతదేహాన్ని మోసుకెళ్లిన తండ్రి

Dana manjhi rerun poor father carries dead body of son

poor father carries dead son, Etawah govt hospital, Uttar Pradesh, labourer carries dead son over shoulder, Udayveer, labourer, son, Pushpendra, deadbody, Rajeev Yadav, Chief Medical Officer, Etawah district of Uttar Pradesh

In a tragic incident a poor father was forced to carry the lifeless body of his 15-year-old son over his shoulder after he was turned away by the doctors at a reputed government hospital in the Etawah district of Uttar Pradesh.

యూపీ వైద్యుల నిర్వాకం: భుజాలపై కొడుకు మృతదేహాన్ని మోసుకెళ్లిన తండ్రి

Posted: 05/02/2017 04:00 PM IST
Dana manjhi rerun poor father carries dead body of son

వైద్యో నారాయణో హరి అంటూ వైద్యుడ్ని నారాయణుడు లేదా భగవంతుడితో పోల్చుతున్నా.. వైద్యులు మాత్రం తమ నిర్లక్షపు వైఖరిని వీడటం లేదు. రోగులు మరణించిన క్రమంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు సర్వీసులను కావాలా అని విచారించి.. వారికి సాయం అందించాల్సిన వైద్యులు..మృతుల కుటింబికులు కోరినా.. వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించకపోవడం లేదు. దీంతో మృతుడి బంధువులు తమవారి బౌతిక ఖాయాలను భుజాలపై వేసుకోని, కొందరు సైకిళ్లపై వేసుకుని తీసుకెళ్లిన అనేక ఘటనలు ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అప్పడప్పుడూ వార్తలుగా నిలుస్తున్నాయి.

అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటావా జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని దానా మాంఝీ ఎదుర్కోన్న విపరీత పరిస్థుతులను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఉదయ్ వీర్ అనే దినసరి కూలీ కూడా అనుభవించాడు. తన 15 ఏళ్ల కొడుక్కు పుప్ఫేంద్ర కాళ్ల నోప్పితో బాధపడుతుండటంతో ఆయన తండ్రి ఉదయ్ వీర్ ఈటావా జిల్లాలోని అస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే అక్కడే చికిత్స సోందుతూ పుష్పేంద్ర మరణించాడు. కాళ్లనోప్పితో వచ్చిన ఫుష్పేంద్ర శరీరంలో ఏ అవయవాలు సరిగాలేవని వైద్యులు తలిపారు.

కాగా, కొడుకు మరణంతో పుట్టెడు దు:ఖంలో వున్న ఉదయ్ వీర్.. అక్కడే వున్న అస్పత్రి సిబ్బందితో పాటు వైద్యులను కూడా తనకు సాయం చేయాలని కోరాడు. తన కోడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సాయం చేాయలని అందుకు అంబులెన్సును పంపాల్సిందిగా కూడా కోరాడు. కానీ వైద్యలు అందుకు నిరాకరించడంతో తన బిడ్డ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్తూ చిన్నపిల్లాడి కన్నా అద్వానంగా కన్నీరు మున్నిరుగా విలపించాడు.ఇది చూసిన స్థానికులు ఆ దృశ్యాలను ఫోటో తీయడంతో అది కాస్తా వైరల్ న్యూస్ గా మారింది.

దీనిపై స్పందించించి ఈటావా జిల్లా వైద్యాధికారి రాజీవ్ యాదవ్ స్పందిస్తూ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా హేయకరమైందని అభివర్ణించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇది అస్పత్రి వర్గాల తప్పిదమేనని చెప్పిన ఆయన ఇందుకు బాధ్యలైనవారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అదే రోజున జరిగిన బస్సు ప్రమాద బాధితులతో అస్పత్రి పూర్తిగా విషాధచాయలతో నిండుకున్న నేపథ్యంలోనే బాధితుడ్ని అస్పత్రి వైద్యలు అంబులెన్స్ కావాలా..? అని విచారించలేకపోయారని రాజీవ్ యాదవ్ అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles