Vidyasagar Rao laid to rest విద్యాసాగర్ రావుకు అశ్రునయనాల వీడ్కోలు..

Eminent irrigation expert r vidyasagar rao passes away

bladder cancer, continental hospitals, government of telangana, hyderabad, hyderabad news, irrigation expert, r vidyasagar rao, telangana, telangana news, telangana today, vidyasagar rao, news

Irrigation expert R Vidyasagar Rao, last rites were held with official honours at Amberpet crematorium on Sunday with his family members consigning the mortal remains to flames.

విద్యాసాగర్ రావుకు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు..

Posted: 04/30/2017 10:24 AM IST
Eminent irrigation expert r vidyasagar rao passes away

తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్ రావుకు అదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి, తెలంగాణ ఉద్యమకారులు, ఇరిగేషన్ శాఖ ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. నగరంలోని అంబర్ పేట శ్మాశాన వాటికలో ఆయన కుటుంబసభ్యులు హైందవ ధర్మాలను అనుసరించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు పాల్టొనగా వారి అశ్రునయనాల మధ్య అంతిమసంస్కారాలు నిర్వహించారు.

అంతకుముందు అదివారం విద్యాసాగర్ రావు మృతదేహాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటతడిపెట్టారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగర్ రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు. తెలంగాణ రైతుల దీనగాథలను అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌కు పాఠాలుగా విద్యాసాగర్‌రావు బోధించారు. తెలంగాణలో అనేక వ్యవసాయ ప్రాజెక్టులు కేవలం పునాది రాళ్లకే పరిమితం కాగా, తీవ్ర ఆవేదన చెందే విద్యాసాగర్‌రావు ఆ విషయాలు కేసీఆర్ కు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vidyasagar rao  bladder cancer  kcr  last rites  last journey  

Other Articles