Punjab woman marries same-sex partner in Jalandhar ఓరి దేవుడా లోకం మారెరా..! యువతితో మహిళకు పెళ్లి..

Punjab woman marries same sex partner in jalandhar

Manjit Sandhu same sex marriage, government warden same sex marriage, same sex marriage in punjab, punjab warden, Punjab police, same-sex partner, Jalandhar, ASI marries same-sex partner, lesbian partner, Hindu rituals, Punjab, Pucca Bagh area

Manjit Sandhu (44), who tied the knot with her 27-year-old same-sex partner, denied some of the facts that had been circulating in the media, saying “it is intrusion of my privacy.”

ITEMVIDEOS: యువతిని పెళ్లి చేసుకున్న మహిళ ప్రభుత్వ ఉద్యోగి

Posted: 04/27/2017 11:57 AM IST
Punjab woman marries same sex partner in jalandhar

ఓరి దేవుడా లోకం మారెరా.. అంటూ పాటను అలపించాల్సిన పరిస్థితులు భారత్ దేశంలోనూ ఉత్పన్నమవుతున్నాయి. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం వివాహమంటే అత్యంత పవిత్రమైన వేడుక. ఒక యువకుడు, యువతి మధ్య పెనువేసుకోనున్న నూరేళ్ల బంధం. కానీ దేశంలో పరిస్థితులు పాశ్యాత సంస్కృతి దిశగా శరవేగంగా పయనిస్తున్నాయి. అందుకు పంజాబ్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర పెళ్లి వేడుకే నిదర్శనం. హైందవ ధర్మాలను అచరిస్తూ జరిగిన ఈ పెళ్లిలో ఓ మహిళ మరో యువతి మెడలో తాళి కట్టి తన అర్థాంగిగా చేసుకుంది.

వివరాలోక్లి వెళ్తే.. పంజాబ్ మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తుందని జాతీయ మీడియా వెల్లడించినా.. తాను పోలీసు శాఖ ఉద్యోగిని కానని, అయితే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నాని తనకు తానుగా వెల్లడించిన మంజీత్‌ కౌర్‌ సంధూ.. హిందూ సంప్రదాయం ప్రకారం జ‌లంధ‌ర్ న‌గ‌రంలో 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుని త‌న ఇంటికి తీసుకెళ్లింది. ఈ వివాహ వేడుక‌కు ఇరు కుటుంబాల‌ బంధుమిత్రులు హాజ‌ర‌య్యారు. ఓ మ‌హిళ‌తో మ‌రో మ‌హిళ‌కు పెళ్లి కావ‌డంతో వారి వివాహ వేడుక‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ పరిణయం.. అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాహంపై నెట్ జనులు కూడా తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు. ఈ పెళ్లిని కొంద‌రు ప్రశంసిస్తుంటే, మ‌రికొందరు విమ‌ర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం అని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇంకోందరు మాత్రం ఇప్పటికే పంజాబ్ యువతకు సరిపోయే సంఖ్యలో యువతులు లేరని.. ఇక ఇలాంటి వివాహాలు జరిగితే.. యువకులు కూడా అదే బాట పట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని పలువరు నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles