Harbhajan slams pilot for racist remarks "బ్లడీ ఇండియన్" అన్న పైలట్ పై మండిపడ్డ క్రికెటర్

Harbhajan slams jet airways pilot for racist remarks physical assault

harbhajan singh, jet airways, twitter, racist remarks, Mumbai Indians, team India, cricket, cricket news, harbhajan singh jet airways, harbhajan singh jet airways pilot, Bernd Hoesslin, physical assault on passenjer, Bernd Hoesslin news, Indian premier league, ipl 2017, ipl 10

Harbhajan Singh lost his cool and lashed out at Jet Airways pilot for racial discrimination against a fellow Indian passenger on the flight

"బ్లడీ ఇండియన్" అన్న పైలట్ పై మండిపడ్డ క్రికెటర్

Posted: 04/26/2017 04:09 PM IST
Harbhajan slams jet airways pilot for racist remarks physical assault

భారత స్పిన్ దిగ్గజం, టీమిండియా ప్రపంచ కప్ ను రెండోసారి అందుకోవడంలో తనవంతు పాత్ర కూడా వుందని నిరూపించుకున్న అఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇవాళ జెట్ ఎయిర్ వెస్ పైలెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ప్రత్యర్థులతో రసవత్తరంగా మ్యాచ్ సాగుతున్న క్రమంలో మైదానంలోకి దిగితేనే అగ్రహంగా కనిపించే భజ్జీ చాలావరకు మిగిలిన సమయంలో కూల్ గానే వుంటాడు,. కానీ అలాంటి కూల్ గా వుండే క్రికెటర్.. ఎందకనే జెట్ ఎయిర్ వేస్ విమాన పైలెట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు. భారత్ దేశంలో తన విధులు నిర్వహిస్తూ.. ఇక్కడ జీవనోపాధిని గడిస్తూ.. అదే ఇండియన్ ప్రయాణికుడిపై అమానుషంగా ప్రపర్తించడంతో పాటు బ్లడీ ఇండియన్ అంటూ అవమానపర్చే దోరణితో వ్యవహరించిన పైలట్ పై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అయన కోపానికి కారణమైంది. ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా ఇవాళ పోస్టు చేసి విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఇలాంటి ఫైలట్ పై సదరు విమానాశ్రయ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

విమానంలో తన పక్కగా కూర్చున్న సహచర ప్యాసింజర్ పై పైలట్ బ్లడీ ఇండియన్ నా ఫ్లైట్ నుంచి దిగిపో అంటూ తిట్టారని, అంతటితో అగకుండా అమెను శారీరకంగా అవమానించారని, అప్పటికీ ఊరుకోని పైలట్ ఒక వికలాంగుడిని కూడా దుర్భాషలాడారని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడే పైలట్ తో తేల్చుకుంటే తాను తప్పుచేసిన వాడినవుతానని చెప్పిన భజ్జీ.. తన అభిమానులతో పంచుకుని అలాంటి పైలట్ లకు శిక్ష విధించడమే తన కర్తవ్యంగా మలుచుకుని మౌనంగా వుండిపోయానని అన్నారు.

అయితే ఇవాళ పలు వరుస ట్విట్లతో తోటి ప్యాసెంజర్ గా తాను అనుభవించిన భాధను వ్యక్తం చేసిన భజ్జీ.. జెట్ ఎయిర్ వేస్ పైలట్ బెన్నార్డ్ హోస్లెన్ పై సదరు విమాన సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. భజ్జీ ఈ విషయాన్ని ట్విట్ చేసిన కొన్ని గంట్లలోనే అది కాస్తా వైరల్ అయ్యింది. భజ్జీ అభిమానులు షేర్లు, రీ ట్విట్లతో దుమ్మురేపుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  jet airways  twitter  pilot  Bernd Hoesslin  racist remarks  cricket  

Other Articles