Dhinakaran arrested in EC bribery case.

Aiadmk s dinakaran arrested for bid to bribe poll panel

AIADMK Amma, AIADMK Amma Leader, TTV Dinakaran, Dinakaran Arrest, EC Bribery Case, AIADMK Dinakaran, Dinakaran Delhi Police, Dinakaran Mallikarjuna, Dinakaran Two Leaves Symbol

AIADMK Amma leader TTV Dinakaran, accused of bribing an Election Commission official to get the frozen ' two leaves' symbol, has been arrested by Delhi Police's Crime Branch.

ITEMVIDEOS:అన్నాడీఎంకే నేత దినకరన్ అరెస్ట్

Posted: 04/26/2017 08:15 AM IST
Aiadmk s dinakaran arrested for bid to bribe poll panel

ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ టీవీవీ దినకరన్ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో నాలుగు రోజుల హైడ్రామా తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దినకరన్ మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల అధికారికి 50 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఢిల్లీ పోలీసులు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌, ఆయన స్నేహితుడు మల్లికార్జున్‌ను కూడా అరెస్ట్ చేశారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ రంజన్ గత అర్ధరాత్రి 11.52 గంటలకు అరెస్టును ప్రకటించారు. కేసు దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఏడు గంటలు, రెండో రోజు 10, మూడో రోజు 9, నాలుగో రోజు 10 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు ముందు బకాయించిన తర్వాత వాట్పాప్ సందేశాలు, వీడియోల ఆధారంగా ప్రశ్నించేసరికి అతని నుంచి విలువైన సమాచారాన్ని రాబట్ట గలిగారు.

ఈ వ్యవహారంలో మంత్రులు, మరి కొందరి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. త్వరలో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్రోకర్ సుఖేశ్ చంద్రశేఖర్‌ను తాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే అతడికి తాను డబ్బులు ఇవ్వలేదని విచారణలో దినకరన్ పేర్కొన్నారు. విలీన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దినకరన్ అరెస్ట్‌తో తమిళనాట పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దినకరన్ అరెస్ట్‌ వెనుక బీజేపీ, పన్నీర్ సెల్వం కుట్ర ఉందని శశికళ వర్గం నేత నాంజిల్ సంపత్ ఆరోపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK Amma Party  TVV Dinakaran  EC Bribery Case  Arrest  

Other Articles