CBI books ex-chief Ranjit Sinha in corruption case పంజరంలోని చిలుక.. అంటింది మరక..

Cbi files fir against former director ranjit sinha in coal scam

cbi files case against cbo ex chief, cbi files fir against ranjith sinha, cbi former director booked under corruption case, Ranjit Sinha, Central Bureau of Investigation, CBI, coal block allocation scam, coal block, Coalgate

The CBI has filed an FIR against its former director Ranjit Sinha who is accused of influencing the probe in coal block allocation during his tenure as director of the probe agency.

సీబీఐ మాజీ డైరెక్టర్ కు షాక్.. కేసు పెట్టిన సీభిఐ

Posted: 04/26/2017 08:37 AM IST
Cbi files fir against former director ranjit sinha in coal scam

సీబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు షాక్ తగిలింది. ఆయనకు తన సొంత శాఖ అధికారులే ఈ షాక్ ఇచ్చారు.  ఆయన సీబిఐ డైరెక్టర్ గా వున్న కాలంలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం సిబీఐని పంజరంలోని చిలుకగా అభివర్ణించింది. సిబిఐలాంటి సంస్థలకు స్వతంత్ర హోదా కల్పించాలని కూడా సూచించింది. అలాంటి పంజరంలోని చిలుకకు ఎట్టకేలకు మరక అంటింది. అది కూడా దేశ ఖజానాను కొల్లగొట్టారని అరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణం కేసులో రంజిత్ సిన్హాపై సిబీఐ.. న్యాయస్థానం అదేశాల మేరకు కేసు నమోదు చేసింది.

బొగ్గు కుంభకోణం దర్యాప్తును రంజిత్ సిన్హా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్ గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా పనిచేశారు.

బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో సిబిఐ డైరెక్టర్ గా వ్యవహరించిన రంజిత్ సిన్హాను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కోంటున్న కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్ సిన్హాపై కేసు నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles